వైద్య పరీక్షలు చేయించుకోండి.. లేకపోతే పోతారు!

ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వడానికి ఇంకా వారం రోజుల సమయం వుంది. ఈలోపు వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు.. వీళ్ళందరూ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పని ఒకటి వుంది.. అదేంటంటే, అర్జెంటుగా హెల్త్ పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా బీపీకి సంబంధించిన సమస్యలు గానీ, గుండెలో ఏదైనా ప్రాబ్లం గానీ వుంటే, అర్జెంటుగా ట్రీట్‌మెంట్ మొదలుపెట్టేసుకోవాలి. ఎందుకంటే, జూన్ 4న వెల్లడయ్యే ఫలితాలు వాళ్ళకి బీపీ భారీగా పెంచే అవకాశం వుంది. హార్ట్ ఎటాక్‌లు ఎటాక్ అయ్యే ఛాన్సుంది. అధికారం, పదవులు పోతే పోయాయి.. కనీసం ప్రాణాలన్నా మిగలాలి కదా..  బతికుండే బలుసాకు తిని బతకొచ్చు. 

నిజానికి ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుని, ఎలాంటి షాక్ తగిలినా భరించడానికి మానసికంగా సిద్ధంగా వున్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళయితే అటు శారీరకంగా సిద్ధంగా లేరు.. మానసికంగానూ సిద్ధంగా లేరు. ఆయన త్వరగా కోలుకుని మంచం దిగాలని ఆశిద్దాం. కాబట్టి, ఇలా తెలివైన నాయకుల మాదిరిగా కాకుండా, ఇప్పటి వరకు వైద్య పరీక్షలు చేయించుకోనివాళ్ళు ఎవరైనా వుంటే అర్జెంటుగా ఆ పనేదో పూర్తి చేసుకుంటే ప్రాణాలు దక్కి, ఫ్యామిలీకి మిగులుతారు.

Teluguone gnews banner