షెల్టర్ కావలెను: వైసీపీ నాయకుల వెతుకులాట!

ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విక్టరీ కన్ఫమ్ అయిపోయింది. రిజల్ట్స్ రావాల్సిన అవసరం లేదు.. ఎగ్జిట్ పోల్స్ చెప్పాల్సిన పనిలేదు.. పోలింగ్ రోజున ఓటర్ల వేవ్ గమనించినా, ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు గమనించినా టీడీపీ గ్రాండ్ విక్టరీ ఖాయం అనేది అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు తమకు తామే ఊహించుకున్న భయాలతో వణికిపోతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు, దారుణాలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేశారు. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహదేవ అన్నట్టు.. తాము చేసిన దాడులు తమ మీద కూడా రిపీట్ అవుతాయన్న భయంతో వైసీపీ క్యాడర్ వణికి చస్తోంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే జూన్ నాలుగో తేదీన తమ ఇళ్ళలో, తమ ఊళ్ళో లేకుండా వేరే ఎక్కడైనా తలదాచుకునే ప్రయత్నాల్లో వున్నారు. వైసీపీ నాయకులైతే ఏ హైదరాబాద్‌లో వెళ్ళి గెస్ట్ హౌసుల్లో రెస్ట్ తీసుకుంటారు. కానీ, నాయకులు చెప్పినట్టు చేసి విధ్వంసం సృష్టించిన కార్యకర్తల పరిస్థితి ఏంటి? అందుకే వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక వేరే ఊళ్ళలో వున్న తమ బంధువుల ఇళ్ళలో తల దాచుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. అయితే ఇలాంటి వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం వల్ల తమ కొంపమీదకి ఏమొస్తుందో అని సదరు బంధువుల భయపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పెద్దలు ఏనాడో అన్నారు.. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అని!

Teluguone gnews banner