మంగళగిరిలో వైసీపీ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్!?
posted on Aug 10, 2024 @ 5:28PM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ కు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ప్రత్యర్థులనే వారే లేకుండా పోయారా? మంగళగిరి నియోజకవర్గం నుంచి తొలి సారి 2019 ఎన్నికలలో పరాజయం పాలైన నాటి నుంచి అక్కడ విజయమే లక్ష్యంగా అడుగులు కదిపిన లోకేష్ అదే నియోజకవర్గం నుంచి 2024లో అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికలలో ఆయనకు ప్రత్యర్థిగా చేనేత వర్గానికి చెందిన లావణ్య పోటీ చేసి పరాజయం పాలయ్యారు. లావణ్యది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. లావణ్య మావగారు హనుమంతరావు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. అలాగే లావణ్య తల్లి కాండ్రు కమలకుమారి కూడా ఎమ్మెల్యేగా పని చేశారు. అటువంటి కుటుంబం ఇప్పుడు నారా లోకేష్ పని తీరును మెచ్చుకుంటున్నారు.
మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లావణ్య మావయ్య మరుగుడు హనుమంతరావు.. లోకేష్ పని తీరును ప్రశంసిస్తున్నారు. త్వరలో ఆయన సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరుతారని వైసీపీ వర్గీయులే అంటున్నారు. నియోజకవర్గంలో బలమైన చేనేత సామాజిక వర్గానికి చెందిన మరుగుడు హనుమంతరావు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరితో మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలి ఎన్నికలలో మరుగుడు హనుమంతరావు వైసీపీ అభ్యర్థి లావణ్యకు మద్దతుగా చురుకుగా పని చేశారు. అయితే ఎన్నికల తరువాత నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో లోకేష్ చూపుతున్న చొరవకు తాను ఆకర్షితుడనయ్యానకి ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారు. అంతే కాకుండా పార్టీలో, ప్రభుత్వంలో కూడా లోకేష్ క్రియాశీలంగా వ్యవహరించడమే కాకుండా, ప్రజాదర్భార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.
తొలిసారి ఎమ్మెల్యే అయినా ఎంతో అనుభవం ఉన్న నేతగా ప్రజలలో మమేకం అవుతూ వారి ఆదరణ చూరగొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో లోకేష్ చూపుతున్న శ్రద్ధ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆయనను ఆత్మీయుడిగా మార్చేసింది. ఈ నేపథ్యంలోనే మురుగుడు హనుమంతరావు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయించు కున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో లోకేష్ సమక్షంలో ఆయన తెలుగుదేశం కండువా కప్పుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సిద్ధమయ్యారన్న అంశం వైసిపి వర్గాల్లో చర్చకు దారితీసింది. త్వరలోనే నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరేందుకు హనుమంతరావు.రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇక మంగళగిరిలో వైసీపీ దుకాణ్ బందేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.