మచిలీపట్నంలోనూ వైసీపీ అక్రమ కట్టడం!

వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమ కట్టడాల నిర్మాణానికి పాల్పడింది. ఇప్పటికే తాడేపల్లి ప్రాంతంలో అక్రమ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చింది. అలాగే విశాఖ, అనకాపల్లిలో వున్న కట్టడాల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారింది. మచిలీపట్నంలో కూడా వైసీపీ పార్టీ కార్యాలయం పేరుతో అక్రమ కట్టడాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.

మచిలీపట్నం పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం వైసీసీ కార్యాలయం నిర్మాణం పూర్తి అయ్యే దశలో వుంది. ఇప్పుడు అధికారులు ఈ కట్టడం మీద దృష్టి సారించారు. పోలీసు గ్రౌండ్స్.లో వున్న రెండెరకాల స్థలాన్ని మునిసిపాలిటీలో మూజువాణి ఓటుతో ఆమోదించుకుని వైసీపీ కృష్ణాజిల్లా కార్యాలయ నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి ఈ భూమి పోలీసు శాఖది. పోలీసు శాఖపై ఒత్తిడి తెచ్చి.. మునిసిపాలిటీ పాలక మండలి అనుమతితో ఈ అక్రమన నిర్మాణం చేపట్టారు. ఈ భూమిపై నిజానికి మునిసిపాలిటీకి అధికారం లేదు. పైగా ఒక రాజకీయ పార్టీకి 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ మునిసిపాలిటీ పాలక మండలి ఆమోదం తెలపటం అభ్యంతరకరమని అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాదించింది. కానీ అధికార బలంతో ఈ భూమిని జగన్ పార్టీ స్వాధీనం చేసుకుంది. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో భోగరాజు సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంకు ముందుకు వచ్చింది. కానీ ప్రభుత్వం  భూమి ఇవ్వలేదు. ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి కృషి చేశారు. అయితే, బాలశౌరి మీద వ్యతిరేకతతో అప్పటి ఎమ్మెల్యే పేర్నినాని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పోలీసు పేరేడ్ గ్రౌండ్‌లో నిర్మించిన జగన్ పార్టీ కార్యాలయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. 

Teluguone gnews banner