టి20 అప్ డేట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
posted on Mar 15, 2016 @ 7:22PM
ఇండియాలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో, ఈరోజు ఇండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ తో జరగబోయే ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభంతో టోర్నీ మొదలెట్టాలని టీం ఇండియా ఉవ్విళ్లూరుతోంది. న్యూజిలాండ్ కూడా బలమైన ఇండియాను సమర్ధంగా ఎదుర్కోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ప్రస్తుతం టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాగ్ పూర్ లో జరగబోయే ఈ మ్యాచ్ కు బ్యాటింగ్ వికెట్ సిద్ధంగా ఉంది. భారీ స్కోర్లు నమోదవడం ఖాయం.
ఇండియా ఆసియా కప్ గెలిచిన టీంతోనే రంగంలోకి దిగుతుండగా, న్యూజిలాండ్ మాత్రం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల సూత్రాన్ని ఎంచుకుంది. టిమ్ సౌతీ, బౌల్ట్, మెక్ గ్లెనాగన్ లాంటి తమ టాప్ బౌలర్లను ఈ మ్యాచ్ కు పక్కన పెట్టి వారి స్థానంలో స్పిన్నర్లు నాథన్ మెకల్లమ్, ఇష్ సోథీ, మిచెల్ సాంట్నెర్ లకు చోటు కల్పించింది న్యూజిలాండ్. కేవలం ఆడం మిల్నే, కోరీ యాండర్సన్ లు మాత్రమే న్యూజిలాండ్ కు పేస్ బౌలింగ్ చేయబోతున్నారు. తమ టాప్ బౌలర్లను పక్కన పెట్టి, స్పిన్నర్లను తీసుకోవడం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా మారింది. న్యూజిలాండ్ సెకండ్ బౌలింగ్ చేస్తుండటంతో, మంచు ప్రభావాన్ని ముగ్గురు స్నిన్నర్లు ఎంతవరకూ అడ్డుకుంటారనేది ఆసక్తికరం..