తన భర్త నుండి తన ప్రియుడిని కాపాడండి..
posted on Jun 9, 2021 @ 2:19PM
పెళ్లి చేసుకున్నారు.. సంసారం కూడా చేశారు..పెళ్లి అవగానే అందరూ ఆనందంగా ఉన్నట్లు.. ఈ జంట కూడా హ్యాపీ గా ఉన్నారు.. రోజు ఆమె భర్త పొగడ్తలతో ముంచెత్తే వాడు.. పొగడ్తలు అంటే ఆడవాళ్లు పొంగి పోతారన్న విషయం అందరికి తెలిసిందే.. అయితే కొద్దీ రోజుల తర్వాత మొగుడు ఆమెను ఆమె అందాన్ని పొగడగడం మానేశాడు.. ఇంకా అంతే భర్త పొగడం మానేశాడని ఆ భార్య ఏంచేసిందో చూడండి..
రాను రాను జనంలో బంధాలకు, బంధుత్వాలకు చోటు లేకుండా పోతుంది.. విలువలను నిలువునా గంగలో ముంచుతున్నారు. పవిత్రమైన పెళ్లిని పక్కన పెట్టి అపవిత్రమైన పనులు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా భర్త నుండి తన ప్రియుడిని కాపాడండి..అని ఏకంగా కోర్టుకెక్కింది. వారి అభ్యర్ధనను అంగీకరించిన కోర్టు వారికి పోలీస్ రక్షణ కల్పించాలంటూ తీర్పునిచ్చింది. ఈ విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళ్దాం పదండి..
అది పంజాబ్. ఫరీద్‌కోట్ ప్రాంతం. ఇద్దరు దంపతులు. అతని వయసు 40 సంవత్సరాలు.. తన భార్య ఆమె వయసు 38 సంవత్సరాలు. ఇద్దరు కలిసి నివాసముంటున్నాడు. పెళ్లైన దగ్గర నుండి కలతలు లేని, ప్రశాంతంగా సాగుతున్న ఆ కాపురంలో ఓ కుర్రాడు చిచ్చు పెట్టాడు. పెళ్లైన కొత్తలో రోజూ మెచ్చుకునే వాడు ఆమె భర్త.. ఆ తర్వాత మెచ్చుకోకపోయే సరికి ఆ భార్యకు ఏవోవో ఆలోచనలు రేకెత్తించాయి. మీకు తెలిసిందే కదా పొగిడితే అమ్మాయిలే కాదు ఎవరైనా పడిపోవాల్సిందే.. అదే పద్దతికి అలవాటు పడింది..
కట్ చేస్తే.. రోజు తనను, తన అందాన్ని పొగుడుతూ ఉండే కుర్రాడి పై మనసుపడింది ఆమె.. దాంతో వారిద్దరి చనువు రెండు అడుగులు ముందుకు వేసింది. చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది.కొన్ని రోజులు భర్తకు తెలియకుండా సాగిన చాటు మాటున సాగిన ఆంటీ, అబ్బాయి ప్రేమాయణం ఒకరోజు భర్తకు తెలిసిపోయింది. భర్త నిలదీయడంతో ఆమె ప్రియుడంటే తనకు ఇష్టమని తెగేసి చెప్పింది. ఆ మాట విన్న భర్త కోపోద్రేకుడయ్యాడు. భార్య ప్రియుడ్ని ఇద్దరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భార్య, ప్రియుడితో కలిసి కోర్టుకెక్కింది. తన భర్త నుండి ప్రియుడికి ప్రాణహాని ఉందని, తమకు పోలీసుల రక్షణ కోరింది. రక్షణ కావాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ పిటిషన్ పై కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. 2018 లో వివాహేతర సంబంధం తప్పు కాదు అనే చట్టాన్ని పరిగణలోకి తీసుకొంటూ వారిద్దరికీ పోలీసులు రక్షణ కల్పించవల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుపై ఇలా తీర్పు చెప్పినంత మాత్రాన తాము వివాహేతర సంబంధాల్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు అని కూడా హైకోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరికీ పూర్తీ రక్షణ కల్పిస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఈ సంచలన తీర్పుపై ప్రజలు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. భార్య తప్పు చేసిందన్న కోసం లో భర్త చంపేస్తాను అంటే .. దానికోసం కోర్టుకెక్కాలా..? అని కొందరు. భారత దేశం కూడా పాశ్చ్యాత దేశాలుగా మారుతున్నది అని తెలపడానికి ఈ కేసు ఉదాహరణ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.