డైపర్లో గోల్డ్..
posted on Mar 24, 2021 @ 3:19PM
ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు గడసరి అత్త, సొగసరి కోడలు అనే టైటిల్స్ విన్నాం.. కానీ అత్త కోడళ్ళు ఇద్దరు దొంగలే అన్న టైటిల్ విన్నారా.. అయితే చూడండి. ఎవరు లేని ఇండ్లే వారి టార్గెట్ .. మెల్లిగా ఇంట్లోకి దూరడం ఇంటి యజమాని ఇంట్లో ఉన్నట్లే టీవీ పెట్టి ఇంట్లో ఉన్న వస్తువులు బంగారం తోచుకోవడమే వారి వృత్తి. అలీబాబా అరడజను దొంగల గురించి విన్నాం గానీ.. ఆ ఆడదొంగల గురించి అందులోనూ.. అత్త కోడళ్ల దొంగల గురించి వినలేదంటారా.. ? అయితే చదవండి మీకే తెలుస్తుంది.
వ్యక్తి తన ఇంటికి తలుపులు వేసి పని మీద బయటకు వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తన ఇంటి బలుపు తెరిచే ఉంది. పైగా ఇంట్లోంచి టీవీ సౌండ్ కూడా వినిపిస్తోంది. ఆ వ్యక్తి ఒక్క సరిగా తాను వచ్చింది తన ఇంటికేనా అని షాక్ తిన్నాడు. దీంతో తనకి అనుమానం వచ్చి ఆలోచన తట్టి.. పక్కింటి వాళ్లను కేక పెట్టి ఇంటి బయట కాపు కాయమన్నాడు. అతను ఇంట్లోకి వెళ్లగానే, ఎవరు మీరు.?ఎందుకు వచ్చారు.? ఇలా అడగకుండా లోపలికి రావచ్చా?’ అని ఇద్దరు మహిళలు ఆ ఇంటి యజమానికి ప్రశ్నల వేసి పరీక్షించారు. దీంతో అతడు కాంగ్గుతున్నాడు. నా ఇంటికి నేను అడిగి రావడమేంటని? అసలు మీరు ఎవరంటూ ? నా ఇంట్లో మీరేం చేస్తున్నారు?‘ అంటూ బదులు ప్రశ్న వేశాడు. దీంతో వాళ్లిద్దరూ కాస్త టెన్షన్ తో పాటి చెమటలు పట్టాయి. ఆ తర్వాత దైర్యం చేసి అతడిని లోపలికి లాగబోయారు. ఈ లోపే అతడు వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాడు. బయట ఉన్న వారి సాయంతో వారిని పట్టుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కృష్ణా జిల్లా కంకిపాడు బస్టాండ్ సమీపంలో నివసించే పచ్చిపాల కోటేశ్వరరావు ఆటో డ్రైవర్. తన ఇంటికి తలుపులు వేసి ఏదో పనిమీద బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. దీంతో అనుమానంతో బయట పక్కింటి వాళ్లను ఉంచి లోపలికి వెళ్లి చూస్తే ఇద్దరు మహిళలు కనిపించారు. ‘అడగకుండా లోపలికి ఎందుకొచ్చావు‘ అంటూ ఇంటి యజమానినే నిలదీశారు. దీంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేయగా.. అతడిని పట్టుకుని లోపల కట్టేసే ప్రయత్నం చేశారు. కోటేశ్వరావు తప్పించుకుని బయటకు వచ్చాడు. బయట ఉన్నవారికి విషయం చెప్తే వాళ్లంతా కలిసి ఆ ఇద్దరు మహిళలను అదుపులో ఉంచి. పోలీసులకు సమాచారం అందించారు.
ఆ ఆడవాళ్లు ఇద్దరు విజయవాడ లోని మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, సాత్వితలు అని తేలింది. ఇద్దరూ స్వయాన అత్తాకోడళ్లేననీ, దొంగతనాలే వృత్తిగా చేస్తున్నారని తేలింది. నెల రోజుల క్రితమే సాత్విత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ డైపర్లో కూడా బంగారు ఆభరణాలను ఉంచడాన్ని చూసి అంతా నోటిమీదావేళ్ళు వేసుకున్నారు. తలుపులు వేసి ఉన్న ఇళ్లల్లోకి దూరి, ఇంట్లో టీవీ ఆన్ చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతుంటారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.