తాజ్ మహల్ మూసేస్తారా?
posted on Dec 22, 2022 @ 11:55AM
ప్రపంచంలోని ఎడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ ఇకపైన పర్యాటకుల సందర్శనకు అందేబాటేలో ఉండదా? అంటూ ఔననే అంటోంది ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. కారణమేమిటంటే..ఏళ్ల తరబడి ఆస్తి పన్ను, నీటి పన్ను, సేవా పన్ను బకాయిలు పేరుకు పోవడం. వీటిని పక్షం రోజులుగా చెల్లించకుంటే.. తాజ్ మహల్ కు తాళం వేసేస్తామని యోగి సర్కార్ తాఖీదు ఇచ్చింది.
దేశ ప్రతిష్టకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడాన్ని మూసివేయడమే లక్ష్యం అన్నట్లుగా ఆ తాఖీదు ఉంది. ఇంతకీ విషయమేమిటంటే తాజ్ మహల్ బాగోగులు చూసుకునే పురావస్తు శాఖ ప్రభుత్వానికి తాజ్ మహల్ కు సంబంధించి 5 కోట్ల సేవా పన్ను, 2 కోట్ల నీటి పన్ను, అలాగే ఒకటిన్నర కోట్ల ఆస్తి పన్ను బకాయిపడింది. దీనిని పదిహేను రోజుల్లోగా చెల్లించాలని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డు జమిలిగా తాఖీదులు జారీ చేశాయి.
అయితే ఇందుకు పురావస్తు శాఖ శసేమిరా అంటోంది. పురాతన కట్టడాలకు, చారిత్రక కట్టడాలకు టాక్సులు కట్టడమేమిటి? చాన్సే లేదని సమాధానం ఇచ్చారు. అయితే ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం అయితే ఊరుకుంటుందేమో.. కానీ యూపీలో ఉన్నది బుల్ డోజర్ సర్కార్.. యోగి సర్కార్ ఊరుకుంటుందా.. అంటే ఊరుకోదనే సమాధానమే వస్తుంది ఎవరి నుంచైనా. ఈ తాఖీదుల వ్యవహారం చూస్తుంటే తాజ్ మహల్ కు తాళం తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.