భర్తను కాశీకి పంపి.. ప్రియుడితో స్వర్గం..
posted on Jul 20, 2021 @ 4:05PM
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైతున్నాయి. వివాహేతర సంబంధాలు కాపురాలనే కాదు.. ప్రాణాలనూ కూల్చేస్తున్నాయి. పెద్దల అంగీకారం, పంచభూతాలు వేద మంత్రాల మధ్య మూడు ముళ్ళు ఏడు అడుగులు నడిచిన వాళ్ళు చివరికి పరాయి వాడి మోజులో పడి సొంత వాళ్ళను చంపుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ భార్య ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా చంపించింది. అనంతలోకాలకు పంపేసింది. ఆపై భార్య ఆత్మహత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆమె ఐదు ఏళ్లు విజయవంతంగా తప్పించుకుంది. కానీ.. అబద్ధానికి చాపకింద నీరు లాంటిది ఎప్పుడో అప్పుడు తడి తెలిసినట్లు అబద్దం కూడా బయటపడుతది. నిజానికి నిలకడ ఎక్కువ అంటారు కదా.. ఆలస్యంగానైనా అసలు నిజం బయటకు పొక్కింది. చివరికి ఆమె ఊచలు లెక్కిస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అది మంచిర్యాల జిల్లా బీమారం మండల కేంద్రంలో గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్ వెల్లడించారు. బీమారం మండలంలోని శ్రీరాంపూర్ కాలనీకి చెందిన సత్యరాజ్, కన్నూరి మహేశ్వరి దంపతలు ఉన్నారు. వృత్తి రీత్యా సత్యరాజ్ ఫాస్టర్..ప్రజలను మేల్కొలపడానికి అతను వెళితే , మహేశ్వరికి తన భర్తతో కలిసి పని చేసే గంగాధర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి ఇరువురి విషయం భర్త సత్యరాజ్‌కు తెలియడంతో.. అతను తన భార్యను పలుమార్లు మందలించాడు.అప్పటికే అలవాటైన పని కాబట్టి ఎంత చెప్పిన ఆమెలో మార్పు రాలేదు. ప్రియుడు అయిన గంగాధర్‌తో కలిసి భర్తను హతమార్చాలని వ్యూహం పన్నింది.
అందుకు అద్భుతమైన పధకం వేశారు.. వల్ల పధకాన్ని అమలు చేసే రోజు రానే వచ్చింది. ఓ రోజు సత్యరాజ్ భీమారం మండలంలోని పోలంపల్లి గ్రామానికి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా.. మహేశ్వరి ప్రియుడు గంగాధర్ ముందుగా అనుకున్నట్లు గానే టవేర వాహనంతో ఆక్సిడెంట్ చేశాడు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యరాజ్.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సత్యరాజ్ మృతిపై ఎవరికీ అనుమానం రాకుండా.. తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ స్థానిక పోలీసులకు మహేశ్వరి ఫిర్యాదు చేసింది. కట్ చేస్తే.. ఇది జరిగి కూడా ఐదేళ్లు అవుతోంది. అయితే.. రోజు రోజుకు మహేశ్వరి ప్రవర్తనలో తేడా కనిపిస్తుండటంతో సత్యరాజ్ తల్లికి అనుమానం వచ్చింది. దాంతో తన కొడుకును మహేశ్వరే చంపించిందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. రంగం లోకి దిగి సత్య రాజ్ మరణాన్నికి సంబందించిన కేసు మరోసారి లోతుగా విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను కావాలనే వ్యూహం ప్రకారం చంపించినట్లు మహేశ్వరి పోలీసుల ఎదుట అంగీకరించింది. ఈ కేసులో మహేశ్వరి, ఆమె ప్రియుడు తో పాటు.. మరో ముగ్గురుని పోలీసులుఅ దుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక టవేరా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కవాళ్లు అయిదు నిమిషాల సుఖం కోసం కట్టుకున్నవాడినే చంపుతుందా అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.