ప్రియుడి కోసం కొడుకుతో కలిసి.. భర్తను చంపిన భార్య..
posted on Jun 10, 2021 @ 4:42PM
మగవాళ్లే కాదు ఆడవాళ్ళలో కూడా మానవత్వం మచ్చుకైనా కనిపించడంలేదు..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు నడిచిన భర్తలను చంపడానికి కూడా నేటి తరం ఆడవాళ్లు వెనకాడడం లేదు.. పెళ్లి జరిగాక మరొకడితో అక్రమ సంబంధాలు నడపడం.. ఆ విషమై భర్తలు, భార్యలను మందలిస్తే .. అక్కడితో అన్ని సర్దిపెట్టుకోవాల్సిన భార్యలు భర్తలను చంపేస్తున్నారు.. ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి కేసులు వందలు వేలుగా వెలుగులోకి వస్తున్నాయి.. ప్రియుడి మోజులో పడి ఒక భార్య తన కొడుకు మరియు ప్రియుడి సహాయముతో భర్తను చంపేసింది.. చివరికి ఆ భార్య, తన ప్రియుడు.. ఆమె కొడుకు ఏమయ్యారు అనేది మీరే చూడండి..
అతను ఒక ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్త భాస్కర్ శెట్టి. వయసు 52 సంవత్సరాలు. అతని భార్య పేరు రాజేశ్వరిశెట్టి. ఆమె వయసు 46 సంవత్సరాలు. ఆ ఇద్దరి దంపతులకు 23 సంవత్సరాలు కొడుకు ఉన్నాడు పేరు నవనీత్‌శెట్టి భాస్కర్ శెట్టి వ్యాపార పనుల్లో బిజీ ఉండడంతో. రాజేశ్వరి తమ కుటుంబానికి తెలిసిన జోతిష్యుడు నిరంజన్‌భట్ తో అక్రమ సంబంధం కొనసాగించింది. ఆ ఆ విషయం భర్తకు తెలిసి ఆమెను మందలించాడు. అప్పటికే ప్రియుడి మోజులో ఉన్న అమ్మే తన కొడుకు భాస్కర్ శెట్టి పై లేనిపోనీ మాటలు చెప్పి కొడుకు ప్రియుడి సహాయంతో భర్తను హత్యచేసింది. ఆమెకు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ కర్ణాటకలోని ఉడిపి కోర్టు ఆదేశాలు జారీచేసింది. 2016లో జూలై 28న జరిగిన ఈ హత్య పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సౌదీ అరేబియాలో వ్యాపారాలు చేసే భాస్కర్‌శెట్టికి ఉడుపిలో కూడా హోటళ్లు, లాడ్జ్‌లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. భాస్కర్ శెట్టికి జ్యోతిష్కుడు నిరంజన్ భట్ వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే నిరంజన్‌భట్‌కు భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టికి అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త బిజినెస్ పనుల మీద బయటకు వెళ్లిన సమయంలో రాజేశ్వరి.. నిరంజన్‌భట్‌తో కలిసి రాసలీలలు కొనసాగించేంది. మరోవైపు రాజేశ్వరిని లోబరుచుకున్న నిరంజన్‌భట్.. ఆమెకి ఆనందం ఇవ్వడంతో పాటు.. అతను సంతోషాన్ని పొందడమే కాకుండా.. ఆమె వద్ద నుంచి భారీగా డబ్బులు కూడా మెల్లిగా వసూలు చేయసాగాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెను లూటీ చేస్తూ వచ్చాడు. ఈ విషయం తెలసుకున్న భాస్కర్ శెట్టి తన భార్య రాజేశ్వరిని మందలించాడు. ప్రియుడి బలం ఉన్న ఉన్న ఆమె. భర్త మాటలు చెవిన పెట్టలేదు.. ఎన్ని సార్లు చెప్పి చూసిన రాజేశ్వరి మాత్రం తన పద్దతి మార్చుకోలేదు. కొడుకు నవనీత్ శెట్టికి తన తండ్రి చెడ్డవాడని, అతనిపై లేనిపోని చాడీలు చెపుతూ కొడుకును నమ్మించింది. ఈ క్రమంలోనే భర్తను అడ్డుతొలగించుకోవడానికి ప్రియుడు నిరంజన్‌భట్‌తో కలిసి ప్లాన్ వేసింది. పధకం ప్రకారం ఇంద్రపల్లిలోని ఇంటిలో కొడుకు సాయంతో భర్తను అతికిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత ప్రియుడు సాయంతో భర్త మృతదేహాన్ని యజ్ఞకుండంలో పెట్రోలు పోసి కాల్చివేశారు. ఇందుకు నిరంజన్ భట్ తండ్రి శ్రీనివాస్ భట్ కూడా సహకరించాడు.
కట్ చేస్తే.. తన కొడుకు కనిపించడం లేదని.. కనీసం తన ఆచూకీ కూడా లభించడం లేదని భాస్కర్ శెట్టి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగం లోకి దిగారు విచారణ చేపట్టారు. రాజేశ్వరిపై అనుమానం రావడంతో.. పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపారు. భాస్కర్ శెట్టి తల్లి కోడలిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు జరగగా రాజేశ్వరి శెట్టి తన భర్తను హతమార్చిన అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాజేశ్వరి, నవనీత్ శెట్టి, నిరంజన్‌భట్, శ్రీనివాస్ భట్, డ్రైవర్ రాఘవేంద్రలపై కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన జిల్లా సెషన్స్‌కోర్డు జడ్జి జేఎన్ సుబ్రమణ్య తీర్పునిచ్చారు. రాజేశ్వరి, నవనీత్ శెట్టి, నిరంజన్‌భట్‌లకు జీవతఖైదు విధించారు. డ్రైవర్ రాఘవేంద్రపై ఆధారాలు లేకపోవడంతో విముక్తున్ని చేశారు. ఈ కేసులో నాలుగో నిందితుడు విచారణ జరుగుతున్న సమయంలోనే అనారోగ్యంతో మృతిచెందాడు. ఇక, ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రాజేశ్వరి బెయిల్‌పై బయట ఉండగా.. నవనీత్ శెట్టి, నిరంజన్‌భట్‌లు బెంగళూరు జైలులో ఉన్నారు.