జడ్జి రామకృష్ణ అరెస్ట్ అసలు కథ ఇది..!
posted on Jun 7, 2021 @ 1:56PM
"ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక పంథాలో సాగుతోంది. భారత రాజ్యాంగం కంటే, రాజారెడ్డి రాజ్యాంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది” ఇది విపక్షాలు చేసే విమర్శ. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, ప్రదర్శిస్తున్న వికృత, వికార చేష్టలు, ఎవరంటే వారిపై రాజద్రోహం కేసులు పెట్టి వేదిస్తున్న తీరు, అక్రమ కేసులు, అరెస్టులకు సంబంధించి కోర్టులు ఇస్తున్న సంచలన తీర్పులు, వేస్తున్నమొట్టికాయలు పరిణామాలను గమనిస్తే, నిజంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, కక్షసాధిపు చర్యలకు పాల్పడుతోందని అనుకోవలసి వస్తోంది. చివరకు సుప్రీం కోర్టు కూడా ‘రాజద్రోహం కేసుల లెక్క తెల్చవల్సిందే’ అని వ్యాఖ్యానించింది, అంటే, పరిస్థితి ఎంత దుర్మార్గ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను, పాలకుల నడవడికను, చివరకు వారి వ్యక్తిగత జీవితానికి సంబందించిన వ్యవహారాలను సైతం పరిధి లోబడి విమర్శించే హక్కు ను రాజ్యాంగమే కల్పించింది. కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రిని ఎవరైనా, ఏదైనా ఒక మాటంటే, ఒక విమర్శ చేస్తే, బ్రిటిష్ పాలకుల చీకటి పాలన తాలుకు అవశేషంగా మిగిలిన 124 (A) రాజద్రోహం చట్టాన్ని ప్రయోగించి, ప్రజల పీక నొక్కే ప్రయత్నం చేస్తోంది. చివరకు సొంత పార్టీ ఎంపీనే కాదు, న్యాయమూర్తుల మీద కూడా రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు.
అధికార వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కంటే ముందే చిత్తూరు జిల్లా జడ్జి రామకృష్ణను ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పై విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణపై, రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సుమారు రెండు నెలలుగా ఆయన జైల్లో ఉన్నారు. అయితే, జడ్జి రామకృష్ణ అరెస్ట్ వెనక అసలు కథ వేరే ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ రామకృష్ణ, ఎర్ర చందనం కేసులో, సంబంధం ఉన్న పెద్ద రెడ్ల గుట్టును రట్టు చేశారు. అంతే కాకుండా పెద్దలు చెప్పినమాట వినకుండా ఎదురుతిరిగారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంటోందని జస్టిస్ రామకృష్ణకు మద్దతుగా నిలిచిన మాలలు ఆరోపిస్తున్నారు.
సపోర్ట్ రామకృష్ణ, అనే హాష్’ట్యాగ్’తో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వివరాల ప్రకారం, 2012లో కిరణ్ కుమార రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జస్టిస్ సి.వినాగార్జున రెడ్డి హైకోర్టు జడ్జిగా ఉన్న రోజుల్లో, జస్టిస్ నాగర్జున రెడ్డి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి, రాయచోటి లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్’ గా అప్పాయింట్ అయ్యారు. ఆయన మెయిన్ బిజినెస్.. ఎర్ర చందనం స్మగ్లింగ్. పవన్ కుమార్ రెడ్డి దగ్గర పని చేస్తున్న డ్రైవర్ రామాంజనేయులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడినాడు . అప్పుడు డ్రైవర్ రామంజనేయులు పోలీసులకు తన పేరు బయటపెడతాడేమోనని....పవన్ కుమార్ రెడ్డి భయపడి...ఎర్రచందనం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనం దొంగిలించబడింది అని ముందు తారీఖుతో పోలీసులకు రిపోర్ట్ చేయమని డ్రైవర్ రామాంజనేయులు మీద వత్తిడి చేశారు. అయితే రామాంజనేయులు నిజం చెప్తేనే ఎప్పటికైన భద్రత అని భావించి పవన్ కుమార్ రెడ్డి డిమాండ్ ను తిరస్కరించాడు. దానితో తన డ్రైవర్ రామాంజనేయులు నోరు విప్పితే తన ఎర్ర చందనం స్మగ్లింగ్ దందా తన అన్న జస్టిస్ నాగార్జున రెడ్డి పరువు ప్రతిష్ఠ లు దెబ్బతింటాయని భావించిన పవన్ కుమార్ రెడ్డి డ్రైవర్ రామాంజనేయులుని పెట్రోల్ పోసి తగలపెట్టి హత్య చేయాలని ప్రయత్నిచాడు. అయితే అయన ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు, డ్రైవర్ రామాంజనేయులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. అప్పుడు రాయచోటి సీనియర్ ప్రిన్సిపాల్ సివిల్ జడ్జ్’గా ఉన్న జస్టిస్ రామక్రిష్ణ డ్రైవర్ రామాంజనేయులు మరణవాంగ్మూలం తీసుకోవడానికి ఆసుపత్రికి వచ్చాడు. చావు బ్రతుకుల మద్య ఉన్న డ్రైవర్ రామాంజనేయులు జడ్జ్ రామక్రిష్ణ ముందు అన్ని విషయాలు చెప్పాడు.ఆ వాహనం పవన్ కుమార్ రెడ్డి దే అనీ..అది ఎర్ర చందనం స్మగ్లింగ్ లో పట్టుబడింది అని...కానీ ఆ వాహనం దొంగలు దొంగిలించారని పోలీసులకు తప్పుడు రిపోర్ట్ ఇవ్వమని తన మీద పవన్ కుమార్ రెడ్డి ఒత్తిడి చేయగా డ్రైవర్ రామాంజనేయులు దానికి అంగీకరించక పోవడం వలన పెట్రోల్ పోసి మంటలో హత్య చేయాలని చూశారు అని మరణ వాంగ్మూలం ఇచ్చాడు.ఈ మరణ వాంగ్మూలంలో తన పేరు తీసేయమని పవన్ కుమార్ రెడ్డి జడ్జ్ రామక్రిష్ణ మీద ఒత్తిడి చేశారు.వినకపోతే స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ ముందే జడ్జ్ రామక్రిష్ణ మీద దాడి చేసి కొట్టాడు.ఈ నేపథ్యంలో తన తమ్ముడు పేరును మరణ వాంగ్మూలం నుండి తొలగించడానికి నిరాకరించిన జడ్జీ రామక్రిష్ణను పవన్ కుమార్ రెడ్డి అన్న హైకోర్టు జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి సస్పెండ్ చేయించారు.
తరువాత జస్టిస్ రామక్రిష్ణ జస్టిస్ సి.వి.నాగార్జున రెడ్డి పై పార్లమెంట్ ఉభయ సభల్లో అభిశంశన తీర్మానం ప్రవేశ పెట్టే ప్రయత్నం చేశారు. ఎంపీల సంతకాలు సేకరించారు. కానీ జస్టిస్ నాగార్జున రెడ్డి ప్రమేయం పలుకుబడి వలన అది సఫలీకృతం కాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి గారు పదవి స్వీకరించారు...దళిత మైనారిటీ ఓట్లతో అధికారం లోకి వచ్చి..తన కడప జిల్లా కే చెందిన జస్టిస్ నాగార్జున రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మెన్ గా నియమించారు.ఈ అధినాయకుడి చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు అదే జిల్లాకు చెందిన దళిత జడ్జ్ రామక్రిష్ణ గారి మీద క్రిమినల్ మైండ్ సెట్ తో ఆయన్ను హింసిస్తున్నారు.
ఇది సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనం. ఈ కథనం ప్రకారం... జడ్జి రామకృష్ణ అరెస్ట్ వెనక, జగన్ రెడ్డి ప్రభుత్వం అహంకారంతో పాటుగా కుల దురహంకారం కూడా తోడైందనిపిస్తోంది.