విదేశీ టీకాల కంటే కొవాగ్జిన్ ప్రియం? ఎందుకో తెలుసా..
posted on Jun 10, 2021 @ 7:54PM
రష్యాలో తయారైన స్పుత్నిక్-వి టీకా ధర ఇండియాలో రూ. 1145. యూకే చెందిన ఆక్స్ ఫర్జ్ డెవలప్ చేసిన ఫార్నూలాతో పుణెలోని సీరమ్ ఇన్సిట్యూట్ లో తయారవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర మన దగ్గర రూ. 780. అమెరికాలో తయారైన ఫైజర్ టీకా కూడా మన దేశంలో వెయ్యి రూపాల లోపే ఉండవచ్చని తెలుస్తోంది. ఇక పూర్తిగా దేశీయ తయారీ, హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ధర మాత్రం జీఎస్టీ కలిపి రూ. 1,140. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాల్లో దేశీయ తయారీ కొవాగ్జిన్ ధరే ఎక్కువ.
కొవాగ్జిన్ ధర ఒక్కో డోసు ధర విదేశీ టీకా అయిన కొవిషీల్డ్, ఫైజర్ కంటే ధర కంటే ఇది దాదాపు రెండింతలు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువ ధర కలిగిన టీకాల్లో ఇది మూడోది. నిజానికి దేశీయంగా తయారైన కొవాగ్జిన్ ధర క్కువ ఉండాలి.. కానీ, అంత ఎక్కువ ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కొవాగ్జిన్ ధర.. విదేశీ టీకాల కంటే ఎక్కువగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
కొవాగ్జిన్ తయారీ కొవిషీల్డ్, స్పుత్నిక్ టెక్నాలజీతో పోలిస్తే పూర్తిగా భిన్నమైనది. ఇందులో ఉపయోగింతే సాంకేతికత మిగతా వాటితో పోలిస్తే ఖరీదైనది. కొవాగ్జిన్ తయారీలో అచేతన వైరస్‌ను ఉపయోగిస్తున్నారు. దీని కోసం వందల లీటర్ల సీరంను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్‌ఎల్ ల్యాబ్‌లో వైరస్‌ను అత్యంత జాగ్రత్తగా సీరంలో వృద్ధి చేయాల్సి ఉంటుంది. తిరిగి దాన్ని అచేతన స్థితికి తీసుకెళ్లాలి’’ అని ‘సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ’ సలహాదారు రాకేశ్ మిశ్రా వివరించారు.ఫైజర్, మోడెర్నా టీకాలు ఎంఆర్ఏ వ్యాక్సిన్లు. వీటి తయారీలో కొవిడ్‌కు కారణమయ్యే లైవ్ వైరస్‌ను ఉపయోగించరు. దీనికి బదులుగా వైరస్ ఉపరితలంపై కనిపించే ‘స్పైక్ ప్రొటీన్’ హాని చేయని భాగాన్ని ఉయోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తి ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది.
వైరస్‌లో ఏదైనా వేరియంట్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ప్రభావం చూపలేకపోతే.. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను కొత్త వేరియంట్‌కు అనుగుణంగా త్వరగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇదే పనిచేయాలంటే మాత్రం కొవాగ్జిన్ టెక్నాలజీకి తడిసిమోపెడవుతుంది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో నిష్క్రియం చేసిన వైరస్ ఆధారంగా తయారవుతుంది. కొత్త వేరియంట్‌కు అనుగుణంగా తిరిగి మరో వ్యాక్సిన్ తయారు చేయాలంటే సుదీర్ఘమైన సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ధరలు కొవాగ్జిన్‌తో పోలిస్తే చాలా తక్కువని, అవన్నీ గతేడాదే రూపుదిద్దుకున్నాయి.
ఇక వ్యాక్సిన్ తయారీ ధరల పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాల ధరల్లో వ్యత్యాసానికి వాణిజ్యపరమైన కారణాలు ఉండొచ్చని మిశ్రా అన్నారు. టెక్నాలజీ పరంగా, ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీ చాలా సులభమే కాకుండా చవకమైనవని, వీటి తయారీకి విస్తృత సౌకర్యాలు అవసరం లేదని మిశ్రా వివరించారు. ముఖ్యంగా ముడి సరుకులు, ప్యాకేజింగ్, ప్లాంట్ ఆపరేషన్, నిర్వహణ, ఖర్చులు, లైసెన్స్ కోసం చేసిన ఖర్చు, ఉత్పత్తికి అయ్యే ఖర్చు, క్లినికల్ ట్రయల్స్ వంటి వాటిపై వ్యాక్సిన్ ధర ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్ తయారీకి అయిన ఖర్చుకు మూడింతలుగా దాని ధరను నిర్ణయిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, వ్యాక్సిన్ ఎలా ఉపయోగించాలన్న దానిపై ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించడానికి మరో 30 శాతం ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, పన్నులు, స్టాకిస్టులు, రిటైల్ కెమిస్టుల వాటా తదితరలు కూడా ఇందులో ఉంటాయి.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం భారత్‌లో టీకా తయారీదారులకు ఒక్క డోసులో మూడు నుంచి నాలుగు రూపాయలు మాత్రమే లభిస్తుంది. ప్రొడక్ట్ అభివృద్ధి, తయారీలో ఉన్న వారికి మాత్రం డోసుకు రూ.10 మిగులుతుంది. అయితే తయారీదారులు పెరిగి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే అప్పుడు టీకా ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.