చంద్రబాబు ప్రమాణానికి వస్తున్న ప్రముఖులు వీరే!
posted on Jun 8, 2014 @ 4:43PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. వారిలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, భాజపా అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్ జోషి, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్, కల్ రాజ్ మిశ్రా, పీయూష్ గోయల్, నజ్మా హెప్తుల్లా, అనంత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. వారు ఈ కార్యక్రమానికి రానున్నారు. వారిలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధికా, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వున్నారు. ప్రముఖ సినీనటులు రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఢిల్లీ నుంచి 180 సీట్లతో వున్న విమానం, హైదరాబాద్ నుంచి 212 సీట్లు వున్న విమానం అతిథులను తీసుకుని గన్నవరం విమానాశ్రయానికి రానున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు, మిత్రులు 122 సీట్లు వున్న విమానంలో గన్నవరం వచ్చారు. వీరికోసం గన్నవరం నుంచి సభా స్థలి వరకు మూడు బస్సులను కూడా సిద్ధం చేశారు. జాతీయ మీడియాకు చెందిన 30 మంది ప్రతినిధులు కూడా ఢిల్లీ నుంచి రానున్నారు. పైన పేర్కొన్న ప్రముఖులలో చాలామంది ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. త్వరలో సభాస్థలికి చేరుకుంటారు.