19 మందితో బాబు తొలి మంత్రివర్గం
posted on Jun 8, 2014 @ 4:31PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం రాత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబుతోపాటు 19 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. వీరిలో ఇద్దరు బీజేపీకి చెందిన వారు కూడా వున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన నిమ్మకాయల చిన్నరాజయ్య ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. అలాగే మంత్రులుగా పరిటాల సునీత (రాప్తాడు-అనంతపురం జిల్లా), పల్లె రఘునాథరెడ్డి (పుట్టపర్తి-అనంతపురం), యనమల రామకృష్ణుడు (ఎమ్మెల్సీ-తూర్పు గోదావరి), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి-చిత్తూరు), కిమిడి మృణాళిని (చీపురుపల్లి-విజయనగరం), నారాయణ (నెల్లూరు), పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట-గుంటూరు), రావెల కిశోర్ (ప్రత్తిపాడు-గుంటూరు), దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం-కృష్ణాజిల్లా), కొల్లు రవీంద్ర (మచిలీపట్నం-కృష్ణాజిల్లా), పీతల సుజాత (చింతలపూడి-పశ్చిమ గోదావరి), అచ్చెన్నాయుడు (టెక్కలి-శ్రీకాకుళం), గంటా శ్రీనివాసరావు (భీమిలి-విశాఖ), అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం-విశాఖ), శిద్ధా రాఘవరావు (దర్శి-ప్రకాశం), మాణిక్యాలరావు (బీజేపీ - తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి), కామినేని శ్రీనివాస్ (బీజేపీ, కైకలూరు, కృష్ణాజిల్లా).