బెజవాడ దుర్గమ్మ గుడి అభివృద్ధికి నిధులు.. కేంద్ర మంత్రికి కేశినేని చిన్ని వినతి
posted on Aug 1, 2024 @ 2:15PM
అమరావతి రాజధాని ప్రాంతంలోని అతి పెద్ద, ప్రాచీన దేవాలలయ అభివృద్దికి ప్రసాద్ పథకం కింద వంద కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను కోరారు. కేంద్ర మంత్రి షెకావత్ తో గురువారం (ఆగస్టు 1) భేటీ అయిన కేశినేని చిన్ని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన అభృద్ధి, నిర్మాణాల ప్రతిపాదనలను వివరించారు. ఆ మేరకు ఒక వినతి పత్రం కూడా కేంద్ర మంత్రికి అందజేశారు. ఇప్పటికే దేవాదాయ శాఖ, శ్రీ దుర్గ స్వామి వారి దేవస్థానం ఆలయ ఈవో పత్రిపాదనలు పంపించారని గుర్తు కేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ తరువాత అతి పెద్దది శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానమేనని వివరించారు. బెజవాడ కనకదుర్గమ్మను నిత్యం 25,000 మందికిపైగా భక్తులు సందర్శించుకుంటారనీ, సెలవు రోజులు, శని, ఆదివారాలలో అయితే ఈ సంఖ్య సందర్శిస్తారని, శుక్రవారం, శనివారం, 50,000కు మించుతుందని వివరించారు.
ఇక దసరా నవరాత్రులు, భవానీ దీక్ష విరమణ సమయంలో పలు రాష్ట్రాల నుంచి రెండున్నర లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఇంతటి ప్రసిద్ధ దేవాలయ అభివృద్ధికి కేంద్రం నుంచి ఇతోథిక సహకారం అందజేయాలని కోరారు. కేశినేని చిన్ని అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంతి గజేంద్రసింగ్ షెకావత్ తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పారు.