కల్తీ మందు తాగి ఆరుగురు మృతి.. పలువురి పరిస్థితి విషమం
posted on Dec 7, 2015 @ 12:11PM
విజయవాడలో కల్తీల దందా పెరిగిపోయింది. గత కొద్దిరోజుల క్రితమే కల్తీనెయ్యి ముఠా పట్టుబడింది. ఇప్పుడు విజయవాడలోని కృష్ణలంకలో కల్తీమందు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణలంకలోని హోటల్ స్వర్ణ బార్‌లో కల్తీ మందుతాగి ఆరుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. కాగా హోటల్ కల్తీ మందు అమ్మకంపై స్థానికులు ఆందోళనకు దిగారు.. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ దగ్గరికి చేరుకుని మధ్యం శాంపిళ్లను సేకరించి బార్ ను సీజ్ చేశారు. విజయవాడలోని స్వర్ణ బార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినదని బాధితులు చెబుతున్నారు.