యాసిడ్ బాధితులు కూడా వికలాంగులే.. సుప్రీం కోర్టు
posted on Dec 7, 2015 @ 2:34PM
దేశంలో చాలా మంది యాసిడ్ దాడులకు గురవుతుంటారు. అలాంటి వారి కోసం సుప్రీం కోర్టు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదో ఒక కారణంతో.. ఎవరో దుర్మార్గానికి బలైపోవడం.. యాసిడ్ దాడులకు బలవ్వడం జరుగుతుంటాయి. అలా యాసిడ్ దాడులకు బలైన వారు ఎంతో నష్టపోతుంటారు. అలా యాసిడ్ దాడులకు గురైన వారిని వికలాంగులుగా పరిగణించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ విషయంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యాసిడ్ దాడులకు గురైన వారు వికలాంగులేనని తేల్చి చెప్పింది. వారికి.. వికలాంగులకు ఎలాంటి వసతులు.. రాయితీలు కల్పిస్తారో అవన్నీ కల్పించాలని స్పష్టం చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలని కూడా ఆదేశించింది..