వీడిన పసికందు కిడ్నాప్ మిస్టరీ..
posted on Jul 16, 2016 @ 11:54AM
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో శిశువు కిడ్నాప్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. 36 గంటల్లో పోలీసులు వేగంవంతమైన దర్యాప్తు చేసి కిడ్నాప్ మిస్టరీని చేధించారు. రెండు రోజుల నుండి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఎదురవుతున్న ఈ కేసులో ఎట్టకేలకు పోలీసులు శిశువును ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లను పట్టేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన వ్యక్తులు శిశువును అపహరించినట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలకి దిగి వారిని పట్టుకున్నారు. బిడ్డను క్షేమంగా తల్లిదండ్రులను అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అపహరణ కేసును పోలీసులు సమర్థవంతంగా ఛేదించారని అన్నారు. విజయవాడ డీసీపీ శ్రీనివాస్ తో సహా గాలింపు చర్యల్లో పాల్గొన్న పోలీసులని మీడియా ముందు భుజం తట్టి ఆయన ప్రశంసించారు. శిశువుని అపహరించిన వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగకుండా పకడ్బంధీగా చర్యలు తీసుకుంటామన్నారు.