రాష్ట్ర ప్రభుత్వాలతోనే దేశాభివృద్ధి సాధ్యం..
posted on Jul 16, 2016 @ 12:25PM
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్ లో అంతరాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు పదేళ్ల తరువాత జరుగుతున్న ఈ భేటీలో మోడీ పలు అంశాల గురించి చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని.. విస్తృత చర్చల ద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విధానాలు సక్రమంగా అమలు కావాలంటే రాష్ట్రాల పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. పథకాల అమలులో సమస్యలుంటే చర్చలతో పరిష్కరించుకోవచ్చని మోదీ అన్నారు. కిరోసిన్ వాడకాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సబ్సిడీ, నగదు చెల్లింపులకు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఆధార్ అనుసంధానంతో నిధులు దారి మళ్లకుండా అరికట్టవచ్చన్న మోదీ 79 శాతం మంది వద్ద ఆధార్ కార్డులున్నాయని తెలిపారు. కాగా ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, శాశ్వత సభ్యులు హాజరుకాగా సీఎంలు కేజ్రీవాల్, అఖిలేష్ మాత్రం డుమ్మా కొట్టారు.