టీఆర్ఎల్ లో చేరిన విజయరామారావు..
posted on Jan 4, 2016 9:25AM
టీడీపీ నేత.. మాజీ మంత్రి విజయ రామారావు కొద్ది రోజుల క్రితం టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి మారబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు విజయరామారావు తన చేరిక గురించి ఆలోచించి నిర్ణయం చెబుతానన్నారు.. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా విజయరామారావుకి ఫోన్ చేసి.. పార్టీ మార్పుపై ఆలోచించుకోవాలని.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పారని.. దాంతో విజయరావు కూడా సందిగ్దంలో పడ్డారని అన్నారు. కానీ ఇప్పుడు విజయరామారావు చేరికపై అనుమానాలు తీరిపోయినట్టే. ఎందుకంటే విజయరామారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో విజయరామారావు టీఆర్ఎస్ లోకి చేరారు. కేసీఆర్ గులాబీ కండువాకప్పి విజయరామారావుని పార్టీలోకి ఆహ్వానించారు. కాగా విజయరామారావు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేశారు.