కేరళలో విజయన్ కొత్త చరిత్ర.. కేబినెట్ లో అన్ని కొత్త ముఖాలే..
posted on May 19, 2021 @ 11:55AM
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో,ఆనవాయితీకి భిన్నంగా, సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత వరసగా రెండవసారి, వామపక్ష కూటమిని విజయ పథంలో నడిపించిన, పెన్నిరవి విజయన్ ను సిపిఐ(ఎం) పొలిట్’బ్యూరో పార్టీ శాసనసభ పక్ష నేతగా నియమించింది. అంటే విజయన్. మరో ఐదేళ్ళు కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇది అందరూ ఉహించిందే. ఎదుకంటే ఈ ఎన్నికలలో ఎల్డీఎఫ్ సాధించిన విజయం విజయన్ విజయంగానే పరిగణించవలసి ఉంటుంది.
అనూహ్యంగా కొత్తగా ఏర్పడే విజయన్ సెకండ్ క్యాబినెట్’లో కేకే శైలజ, కే.సురేంద్ర, ఏసీ మొదిఏన్’లకు స్థానం దక్కలేదు. పార్టీ పొలిట్బ్యూరో ఈ ముగ్గురు కీలక నేతల మంత్రివర్గంలో స్థానం కలిపించలేదు. మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా, నూతన అసెంబ్లీలో పార్టీ విప్’గా నియమితులైన, శైలజకు మంత్రి వర్గంలో స్థానం లభించక పోవడం అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. విజయన్ తొలి మంత్రివర్గంలో శైలజ కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. రాష్ట్రాన్ని వణికించిన ‘నిఫా’ వైరస్’ను, ఆ తర్వాత కొవిడ్ 19 కట్టడిలో ఆమె ప్రధాన పాత్రను పోషించారు. అంతేకాదు, లెఫ్ట్ ఫ్రంట్ విజయానికి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటుగా నిఫా , కొవిడ్ 19 మీద కేరళ ప్రభుత్వం సాధించిన విజయం కూడా ఎంతగానో ద్రోహదం చేసింది. ఆ విధంగా లెఫ్ట్ ఫ్రంట్ విజయంలో జైలజ పాత్ర కీలకం. అంతే కాదు, ఏఎన్నికలలో ఆమె కన్నూర్ జిల్లా మత్తన్నూర్’నియోజక వర్గం నుంచి 60,000 పై చిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయినా ఆమెకు మంత్రి వర్గంలో స్థానం దక్కక పోవడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఆమె అభిమానులను నిరాశకు గురుచేసింది.అయినా ఆమె మాత్రం పార్టీ నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. ప్రభుత్వ బాధ్యతలను వంతులవారీగా వేర్వేరు వ్యక్తులకు అప్పగించడం మంచి సంప్రదాయమని అన్నారు.
సీపీఎం పార్టీ పొలిట్బ్యూరో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు కొత్తగా మంత్రివర్గంలో స్థానం కల్పించింది. అందులో ఒకరు సిపిఐఎం రాష్ట్ర తాత్కలిక కార్యదర్శి, విజయరాఘవన్ సతీమణి బిందు. అయితే, ఆమెకు మంత్రి వర్గంలో స్థానం కలిపించడం కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడంగా కొందరు భావిస్తున్నారు. ఒక్క బిందు మాత్రమే కాదు, డివైఎఫ్ఐ అధ్యక్షుడు విజయన్ అల్లుడు, మొహ్మద్ రియాజ్’కు ఇంకా ఒకరిద్దరు బంధుగణాలకు మంత్రి వర్గంలో స్థానం లభించడం పట్ల పార్టీలో గుస గుసలు బయలు దేరాయి. అయితే, పార్టీ నిర్ణయానికి కట్టుబడి, ప్రధానమంత్రి పదవిని వదులుకుని, ఆ తర్వాత పార్టీ నిర్ణయాన్ని ‘చారిత్రక తప్పిదం’ గాభావించి, బాధ పడిన జ్యోతిబసు వారసుల పార్టీ సీపీఎంలో పార్టీ నిర్ణయమే సుప్రీం.అదీగాక, దేశంలో వామ పక్ష పార్టీల గత వైభవానికి చిహ్నంగా మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళ, కాబట్టి పార్టీలో అంతో ఇంతో అసంతృప్తి ఉన్నా అది అంతగా బయటకు రాదని పార్టీ నాయకులు భరోసాగా ఉన్నారు.