ఒకే రోజు 24 భాషల్లో ఉపరాష్ట్రపతి వ్యాసం
posted on Feb 22, 2021 7:52AM
ఒకరే రాసిన, ఒకటే వ్యాసం, ఒకే రోజున, 24 భాషా పత్రికల్లో ప్రచురించడం,అంటే అది మాములు విషయం కాదు. అది కూడా ప్రపంచ మాతృ భాషా దినోత్సవం రోజున ... మాతృ భాష విశేషతను వివరిస్తూ, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు రాసిన వ్యాసం కావడం మరీ విశేషం. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాతృ భాషాభిమానం, తెలుగు భాషాభిమానం గురించి వేరే చెప్పనవసరం లేదు.ఏదో ఏడాదికి ఒక రోజు అన్నట్లు కాకుండా, ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా ... మాతృ భాష, మరీ ముఖ్యంగా మన తెలుగు భాష గొప్పదనం గురించి ఆయన వివరిస్తూనే ఉన్నారు. ఇంకో విషయం, ఇంకో విశేషం, మాతృ భాషా దినోత్సవం రోజున ఉపరాష్ట్రపతి 22 అధికార భాషల్లోనూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు ట్వీట్ చేశారు.
ప్రపంచ మాతృ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని, ‘అమ్మ’ భాష గొప్ప తనాన్ని, మన భాష,మన యాసల పరిరక్షణ అవసరాన్ని, ప్రాధమిక విద్యా బోధనా మాతృ భాషలో జరగవలసిన అవసరాన్ని ... ఇలా ఆనేక అంశాలను విశ్లేషిస్తూ వెంకయ్య నాయుడు రాసిన వ్యాసం ఒకే రోజు 24 ప్రాతీయ భాష పత్రికలో ప్రచురితం కావడం పట్ల భాషాభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.
ఇదలా ఉంటే ... మాతృ భాషా దినోత్సవంసందర్భంగా తానా ప్రపంచ సాహిత్య సమావేశంలో ప్రసంగించిన ఉప రాష్టపతి, ప్రాధమిక విధ్యాబ్యాసం తెలుగు రాష్ట్రాలలో తెలుగులో ... తమిళ రాష్ట్రంలో తమిళంలో, అన్ని రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర భాషల్లోనే జరగాలని ఉద్బోదించారు. అలాగే అన్ని రాష్ట్రాలలో పరిపాలన మాతృ భాషలోనే జరగాలని, తెలుగు వారిని ఆంగ్లంలో పరిపాలించడం ఏమిటని తమదైన శైలిలో చురకలు వేశారు. అలాగే, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్నా తెలుగులో మాట్లాడాలని,అలా మాట్లాడడం గోప్పదనంగా భావించాలని, మన భాష, మన యాసలతో పాటుగా మన కట్టు బొట్టు, సంస్కృతీ, సంప్రదాయలను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరించారు.
అలాగే మహారాష్ట్ర మాజీ గవర్నర్, సిహెచ్ విద్యాసాగర రావు మరో చక్కని సూచనా చేశారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమలో పాల్గొన్న ఆయన, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి అంతర్జాతీయ తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకొచ్చి ప్రణాళికను సిద్ధం చేస్తే 40 దేశాల్లోని తెలుగు వారు సహకరించేందుకు సిద్దంగా ఉన్నారని విద్యాసాగర రావు చెప్పారు. మంచి ఆలోచనే కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు..