ప్రముఖ నటి రాజసులోచన కన్నుమూత
posted on Mar 5, 2013 8:49AM
అలనాటి ప్రముఖ సినీ నటి రాజసులోచన కన్నుమూశారు. చెన్నైలోని స్వగృహంలో ఈ ఉదయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. అగస్టు 15, 1935న విజయవాడ లో జన్మించిన రాజసులోచన తెలుగు,తమిళ్, కన్నడం, హిందీ బాషలలో వందలాది సినిమాలలో నటించారు. తెలుగులో అందరు అగ్రహీరోల సరసన ఆమె నటించారు.1953లో కన్నతల్లి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి రంగప్రవేశం చేశారు. భరత నాట్యం, కూచిపూడి, కధక్, కధాకేళి వంటి నాట్య కళలో ఆరితేరారు. అమెరికా, చైనా, జపాన్, శ్రీలంక , రష్యా, సింగపూర్ వంటి దేశాలలో ప్రదర్శనలిచ్చారు. ప్రముఖ సినీ దర్శకులు సియస్.రావుతో 1963లో వివాహం జరిగింది.