చంద్రబాబు పాదయాత్రలో బాలయ్య ఫొటోస్
posted on Mar 5, 2013 8:27AM
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు కృష్ణా జిల్లాలో భారీ స్పందన లభిస్తోంది. కృష్ణా జిల్లా నుండి గుంటూరు లోకి ప్రవేశించి తిరిగి కృష్ణా జిల్లాలో రెండో విడత పాదయాత్ర చంద్రబాబు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్ర ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సొంతూరు కొమరవోలుకు చేరుకుంది. ఓ రోజు ముందే అక్కడ చంద్రబాబు బసకు ఏర్పాట్లు చేశారు. అమ్మమ్మ ఊరిలోకి బాలకృష్ణ బావ బాలయ్యకు ఎదురేగి ఆహ్వానించారు. పాదయాత్రలో బావతో పాటు కలిసి నడిచారు.