జాతీయ గేయం వందేమాతరం అర్థం తెలుసా మీకు?
posted on Jan 26, 2019 @ 9:51AM
గణతంత్ర దినోత్సవం...సందర్భంగా
భారతీయులందరికీ తెలుగు వన్ చేసుకొనే విన్నపం...
ప్రతిరోజూ మన భారతదేశ జాతీయ గేయాన్ని పఠనం చేసుకుంటున్నాం...
దాని అర్ధం చాలా మందికి తెలియదు. అసలు వాటిలో అర్ధాలను సవివరంగా తెలియజేస్తే..
అందరూ మరెంతో ఆనందపరవశులవుతారని ఆశిస్తూ... వందేమాతర గీతం...గురించి తెలుసుకుందాం..
మన భారతదేశ జాతీయ గేయం వందేమాతరం... దీనిని బెంగాలీ రచయిత బంకించంద్రచటర్జీ రచించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాలీలో ఈయన రచించిన గేయం...రణన్నినాదంగా ఎంతగానో ఉపయోగపడింది.
అందుకే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గేయాన్ని జాతీయ గేయంగా స్వీకరించింది మన భారత ప్రభుత్వం.
అందుకే గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వందేమాతరం గీతాలపన చేసి దాని అర్ధాలు తెలుసుకుందాం...
వందేమాతరం... భారత మాతా నీకు వందనం
సుజలాం సుఫలాం ... గల గల పారే ప్రవాహాలతో
మలయజ శీతలాం... మలయ మారుతముల చల్లని గాలులతో
సస్య శ్యామలాం మాతరమ్... సస్యశ్యామల మైన దేశమా నీకు వందనాలు
||వందే||
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం... తెల్లని వెన్నెలలు కలిగిన రాత్రులలో
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం... వికసించిన పువ్వులు పచ్చని చెట్ల శోభతో
సుహాసినీం సుమధుర భాషిణీం... స్వచ్చమైన నవ్వులు మధురమైన మాటలతో
సుఖదాం వరదాం మాతరమ్... మాకు సుఖమును వరములను ఇచ్చు మాతా నీకు వందనం
|| వందే || ........................ భారత మాతా నీకు వందనం..
కోటికోటి కంఠ కలకల నినాదకరాలే ... కోటి కోటి కంఠముల నినాదములు
కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే... అనేక కోట్ల భుజములు కరములు కలిగిన దేమి
అబలా కేయనో మా ఏతో బలే... అబలకు బలమిచ్చు శక్తిని
బహుబల ధారిణీం నమామి తారిణీం... బాహు శక్తులు ధరించిన మాతా
రిపుదలవారిణీం మాతరామ్... శత్రువు నుంచి మమ్ము రక్షించు మా తల్లీ నీకు వందనం
|| వందే || ......................................భారత మాతా నీకు వందనం...
తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ ... నీవే విద్యవు...నీవే ధర్మము... నీవే హృదయము...నీవే మర్మము...
త్వం హి ప్రాణాః శరీరే .... మా శరీరంలో ప్రాణమూ నీవే...
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి ... మాలో శక్తివి నీవే....మా మనస్సులో భక్తివి నీవే...
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||... మా హ్రుదయమందిరములో ప్రతిమవు నీవే...
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ... పది ఆయుధములు చేత బట్టిన దుర్గవి నీవే...
కమలా కమలదళ విహారిణీ... పద్మ ధళములందు విహరించే
లక్ష్మివినీవే...
వాణీ విద్యాదాయినీ... విద్యాధాత్రివైన శారదవు నీవే...
నమామి త్వాం... తల్లీ నీకు నమస్కారం.....
నమామి కమలామ్ అమలామ్ అతులాం... కమలా..అయలా....అతులా....
సుజలాం సుఫలాం మాతరమ్ ... సుజలా సుఫలా మాతా నీకు వందనం..
|| వందే ||.................. భారతమాతా నీకు వందనం..
శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం... శ్యామలా సరళా సుస్మితా అలంక్రుతా...
ధరణీం భరణీం మాతరం... మా భారము మోయు భారత మాతా నీకు వందనం...
ఇవండీ...మన వందేమాతర గీతం వివరాలు ..అర్ధమైందా.