వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
posted on Jul 1, 2025 @ 10:23PM
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కూటమి ప్రభుత్వం ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి.
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో భాగంగా వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఉన్నారు. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైనట్లయ్యింది. వంశీకి బెయిల్ లభించినప్పటికి, రేపు సుప్రీం కోర్టులో జరిగే విచారణపై ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది.