14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు వల్లభనేని వంశీ
posted on Feb 14, 2025 7:06AM
విజయవాడ కోర్టు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు వంశీని విజయవాడ జిల్లా కోర్టుకు తరలించారు. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీని గురువారం ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. వి
జయవాడలో వంశీని దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన పోలీసులు ఆ తరువాత ఆయనకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా కోర్టులో వల్లభనేని వంశీ తరఫుర పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. గురువారం అర్ధరాత్రి దాటే వరకూ కూడా కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి వంశీకి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఇలా ఉండగా వంశీ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, చంపేస్తానని బెదరించారనీ, దీంతో ప్రాణ భయంతో సత్యవర్ధన్ ఆయన చెప్పినట్లు తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో తన ఫిర్యాదును ఉప సంహరించుకున్నారనీ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.