ఫిటింగ్ వీహెచ్.. ఫిటింగ్ పెట్టాడా?
posted on Sep 14, 2015 @ 5:13PM
రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఊహించని రీతిలో సమాధానం చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేనట్టే మళ్లీ ఏపీలో ఆపార్టీ కోలుకోవాలంటే కొన్ని సంత్సరాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాని కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం ఆపరిస్థితి కనిపించడంలేదు. గత కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న టీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పుడు వారికి అందివచ్చిన ఛాన్స్ లను ఏ మాత్రం వదలిపెట్టుకోకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రైతు ఆత్మహత్యలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతుల ఆతహత్యలను పట్టించుకోకపోవడం వారికి కలిసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎవరికి తోచినట్టు వాళ్లు తమ పర్పెర్మెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు.. కనీసం రైతుల కుటుంబాలను కూడా పరామర్శించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా వీహెచ్ మరో ఫిటింగ్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. అటు టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడుతూనే ఇటు కాంగ్రెస్ నేతలపై కూడా తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం పై దాడి చేస్తూ యాక్టివ్ గా ఉంటే కొంత మంది మాత్రం అవేమి పట్టనట్టూ ఇంట్లోనే కూర్చొని కాలక్షేపం చేస్తున్నారంట. దీంతో ఆయన కాంగ్రెసులో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా - పోరాడకుండా ఉన్న నాయకుల పేర్లను రాసుకొని దానిని టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డికి అందించినట్లుగా తెలుస్తోంది. ఈవిషయాన్ని ఆయనే ప్రకటించారు. అయితే రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని కేంద్రంతో చెప్పే వీహెచ్ ఇప్పుడు ఈ విషయాన్ని కూడా కేంద్రంతో చెప్పి ఉంటారని.. దీంతో వీహెచ్ మళ్లీ ఫిటింగ్ పెట్టారని నేతలు అనుకుంటున్నారు.