కాంగ్రెస్ లో సామాజిక న్యాయం లోపించింది : విహెచ్
posted on Dec 29, 2012 @ 9:45AM
కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లోపించిందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు వి. హనుమంత రావు వ్యాఖ్యానించారు. నిన్న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ నుండి హాజరయిన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డిలు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, ఇలా పంపడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ విషయంలో ప్రశ్నిస్తే, దానికి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడి బొత్స సత్యనారాయణలే సమాధానం చెప్పాలని విహెచ్ స్పష్టం చేశారు. ఇలా చేసి కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయాన్ని ప్రశ్నార్థకంగా మార్చారని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో తెలంగాణా, సీమంధ్రా ప్రాంతాలనుండి ఇతర సామాజిక వర్గాలకు చెందిన అనేక మంది అనుభవం కలిగిన నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. ఆలాంటి వారెవరూ ఈ ప్రతినిధుల ఎంపికలు చేసిన నాయకులకు కనిపించలేదా అని విహెచ్ ప్రశ్నించారు.
బహుశా, విహెచ్ లేవనెత్తిన ఈ కీలక అంశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కాస్తంత గందరగోళాన్నే కలిగించే అవకాశం ఉంది.