ఇరాన్ ఇంధన నౌకలు హ్యూస్టన్ తీరానికి
posted on Aug 14, 2020 @ 11:41AM
ఇరాన్ దేశంపై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన అమెరికా తాజాగా ఆ దేశ నౌకలను హ్యూస్టన్ తీరానికి తరలించింది. ఇరాన్ నుంచి చమురు నింపుకుని వెనిజులా వెళుతున్న భారీ నౌకలను ఫస్ట్ టైమ్ అమెరికా సీజ్ చేసింది. ఇప్పటికే ఇరాన్, వెనుజులా దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. అయితే ఆ రెండు దేశాల మధ్య ఇంధనం సరఫరా చేసే నౌకలను నిర్బంధించడం ఇదే మొదటిసారి. ఈ అంశాన్ని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించింది.
ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఇరాన్ పై అణు పరీక్షలు, క్షిపణుల పరీక్షలను నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. తాజాగా లూనా, పండి, బీరింగ్, బెల్లా అనే పేర్లున్న నౌకలను సైన్యం సహాయంతో సముద్రంలో సీజ్ చేసింది అమెరికా. వాటిని అమెరికాలోని హ్యూస్టన్ తీరానికి తరలించింది. ఇరాన్ నుంచి ఈ ట్యాంకర్ షిప్ లు గ్యాసోలిన్ ఇంధనంతో వెనిజులా వెళుతున్నాయి. ఈ రెండు దేశాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచే ఉద్దేశంలో భాగంగానే వీటిని సీజ్ చేసినట్టు తెలుస్తోంది.