చైనా దుకుడుకు బి-2తో చెక్
posted on Aug 20, 2020 @ 1:37PM
భారత్ కు మద్దతుగా డియోగో గార్పియా గా చేరుకున్న మూడు బి-2 బాంబర్లు
భారత్ సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ కి చెక్ పెట్టేందుకు అమెరికా వైమానిక దళం సిద్ధంగా ఉంది. ఈ మేరకు భారత్ కు సహాయంగా అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన బి-2 స్పిరిట్ బాంబర్లు మూడు హిందూ మహాసముద్రంలోని డియోగో గార్పియా నౌకాకేంద్రానికి చేరుకున్నాయి. 2020 ప్రారంభంలోనే ఇక్కడికి అమెరికా బి-52 హెచ్ ఫైటర్ జెట్లు ఆరు చేరుకున్నాయి. అదనంగా బి-2 బాంబర్లు రావడంతో డ్రాగన్ కంట్రీ కుటిల యత్నాలకు వ్యూహాత్మకంగా చెక్ చెప్పడానికి భారత్ సిద్ధమైంది.
భారత్ చైనా సరిహద్దుల వెంట, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి సమీపంలో, లఢఖ్ సమీపంలోని వైమానిక స్థావరంలో 35 యుద్ధవిమానాలను మోహరించినట్లు నిఘా విమానాల ద్వారా స్పష్టమైంది. రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానికదశంలోకి వచ్చినప్పటి నుంచి చైనా మరింత స్పీడ్ గా ఫైటర్ జెట్ లను సరిహద్దుల వెంట మోహరిస్తుంది.
భారత్ చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో అమెరికా బాంబర్లు భారత్ కు సహాయంగా వచ్చాయి. మూడు బాంబర్లతో పాటు 200మంది వైమానిక దళ సిబ్బంది కూడా సహాయం అందించేందుకు ఇక్కడికి చేరుకున్నారు. డియోగో గార్పియా స్థావరానికి అమెరికా వైమానిక దళ కమాండర్ క్రిష్టఫర్ కోనన్ కూడా చేరుకున్నారు. ఇప్పటికే భారత, అమెరికా వైమానిక దళ సైన్యం ట్రైనింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం భారత్ చైనా మధ్య ఉన్న వాతావరణం ఎప్పుడైనా యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. భారత్ కు మద్దతునిచ్చేలా అమెరికా యుద్ధనౌకలు అండమాన్, నికోబార్ దీవుల సమీపానికి ఇప్పటికే చేరాయి.
29గంటలు ప్రయాణం చేసి...
అతి శక్తివంతమైన బాంబర్ గా పేరున్న బి-2 అమెరికా నుంచి 29 గంటల పాటు ప్రయాణం చేసి హిందూ మహాసముద్రంలోని డియోగో గార్పియా స్థావరానికి చేరుకుంది. మూడు బి-2 బాంబర్లు భారత్ కు అండగా చైనా పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. 50వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేయగల ఈ బాంబర్లు ఒకసారి ఇంధనం పూర్తిగా నింపుకోని దాదాపు 19వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలవు. అంతేకాదు 11వేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ కూడా లక్ష్యాన్ని సరిగ్గా చేధించగల శక్తి సామర్ధ్యం వీటి సొంతం. ఒకోసారి ఏడు అణ్వస్త్రాలను తీసుకుపోగల అత్యంత ఆధునిక బాంబర్ ఇది. ఎజిఎం -129 ఆధునిక క్రూయిజ్ క్షిపణిని కూడా బి-2 మోయగలదు. రాడర్లకు దీని ఉనికి చిక్కద్దు. ఈ బాంబర్ సైలెంట్ గా శత్రు భూభాగంలోని స్థావరాలను టార్గెట్ చేయగలదు. ఇంటలిజెన్స్ గ్రిడ్, ఇంటిగ్రేటెడ్ నిఘాతో పనిచేసే బి-2 ను ఎదుర్కొన్నే శక్తివంతమైన ఫైటర్ల లేవు. గగనతలంలో అత్యధిక ఎత్తులో ఎరుగుతూనే శత్రు కదలికల స్ట్రీమింగ్ వీడియోలను గ్రౌండ్ కంట్రోలింగ్ యూనిట్స్ కు పంపే కమ్యూనికేషన్ వ్యవస్థ ఇందులో ఉంది.