పాక్ ను కొట్టాలంటే ఇండియాకూ 'ఉగ్రవాదులు' కావాలి!
posted on Sep 19, 2016 @ 6:13PM
దేశం రగిలిపోతోంది. సోషల్ మీడియా సెగలుగక్కుతోంది. పాకిస్తాన్ పై పగ తీర్చుకునేందు కోసం తహతహలాడిపోతోంది. యుద్ధం కావాలని అరిచే గొంతులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్యలోనే సంగట్లో సడేమియాలు మోదీని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వుంటే చేతకాని సర్కార్ అన్నారు కదా... ఇప్పుడు మీరేం చేస్తున్నారు? యుద్దం చేయండి! పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయండి! అని రెచ్చగొడుతున్నారు!
ఇంతకీ పాకిస్తాన్ తో యుద్ధం తప్పనిసరా? యూరీలో జరిగిన ఉగ్రదాడి పరమ కిరాతకమైంది. ఇరవై మందికి పైగా మన జవాన్లని బలి తీసుకుంది. ఇంత దారుణమైన దాడి ఈ మద్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. అంతే కాదు, ఇది మోదీ వచ్చాక జరిగిన మరో పెద్ద దారుణం. మొన్నటికి మొన్న పటాన్ కోట్ లో శత్రువులు మన కీలక స్థావరంలో చొరబడ్డారు. అది జరిగాక కూడా ఇలాగే గందరగోళం చెలరేగింది. మళ్లీ అంతా సద్దుమణిగింది. కాని, పాకిస్తాన్ ని మాత్రం మనం ఏం చేయలేకపోయాం!
ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ చాలా చిన్న, బలహీన, పేద దేశం. ఇప్పటికే నాలుగు సార్లు మన చేతిలో చావుదెబ్బతిన్నది కూడా. అయినా ఇండియా ఎందుకు పాకిస్తాన్ పీడ విరగడ చేసుకోలేకపోతోంది? అంతర్గతంగా చెప్పుకుంటే మోదీ లాంటి పీఎం మనకు ఈ మధ్య కాలంలో లేకపోవటమే! అవును... ఇది కాస్త మోదీ భక్తుల భజనలా అనిపించినా చేదు నిజం. మోదీ ప్రధాని అయ్యాక దేశదేశాలు తిరుగుతూ ఇండియాని ఇంటర్నేషనల్ గా ధృడ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవ్వి పదేళ్ల మన్మోహన్ కాలంలో పెద్దగా జరగలేదు. అంతకు ముందు వాజ్ పేయ్ హయంలోనూ ఇప్పటి మోదీ అంత స్పష్టమైన విధానం వుండింది కాదు. ఇక అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రధానుల కాలంలో మన పరిస్థితి మరింత గందరగోళంగా వుండేది. ఒక్క ఇందిరా గాంధీ మాత్రం పాక్ కు ముచ్చెమటలు పట్టించింది. సగం దేశాన్ని విడదీసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసి చావు దెబ్బ కొట్టింది!
ఇప్పుడు మోదీకి కూడా ఇందిర బాటే మంచి మార్గం! అప్పుడు బంగ్లాదేశ్ ఆవిర్భవిస్తే ఇప్పుడు బలూచిస్తాన్ రావాలి. అది ఇందిర నాటి కాలమంత ఈజీ కాదు. అయినా అసాధ్యం కూడా కాదు. పాకిస్తాన్ కు బలూచిస్తాన్ చాలా కీలకమైన ప్రాంతం. దాన్ని విడదీసే చర్యలు జరిగిన కొద్దీ పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అంతే కాదు, చైనా కూడా లక్షల కోట్లు బలూచిస్తాన్ ప్రాంతంలో గుమ్మరించింది. కాబట్టి డ్రాగన్ కూడా బలూచిస్తాన్ ఉద్యమం బలపడినకొద్దీ టెన్షన్ ఫీలవుతుంది. ఈ కారణాల కోసమే ఇండియా బలూచిస్తాన్ అంశాన్ని మరింత మరింత జటిలం చేస్తూ పాక్ ను అల్లాడించాలి. బలూచీల యుద్ధానికి డబ్బులు, ఆయుధాలతో సహా ఇంకా ఏమేం సాయం చేయగలమో చూసుకుని అన్నీ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పాక్ మన భూభాగంపై కాశ్మీర్ వేర్పాటు వాదం ప్రొత్సహించినట్టే మనమూ బలూచిస్తాన్ ప్రాంతంలో ప్రత్యేక దేశ ఉద్యమం బలంగా నడపాలి!
బలూచిస్తాన్ డిమాండ్ బలపరచటం కాకుండా ఇంకా చాలా పనులు చేయోచ్చు ఇండియా. మోదీ మంత్రి వర్గం తీర్మానించినట్టు పాక్ ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలి. దాన్నో టెర్రరిస్టు దేశంగా నిరూపించాలి. ఇప్పటికే అమెరికా సహా దాదాపు అన్ని దేశాలు పాక్ ను దోషిగా అంగీకరించే స్థాయికి వచ్చేశాయి. కేవలం చైనా మాత్రమే తన దుర్బుద్దితో పాక్ ను వెనకేసుకొస్తోంది. కాబట్టి చైనాను మన వైపు తెచ్చుకోవాలి. వాళ్ల బాధంతా టిబెట్ , దక్షిణ చైనా లాంటి అంశాలు కాబట్టి వాటి మీద కొంత క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అప్పటికీ చైనా తన కుక్క తోక ప్రదర్శిస్తే ఆర్దికంగా ఇబ్బంది పెట్టాలి. బీజింగ్ కి మన నుంచి లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇండియన్స్ చైనీస్ ప్రాడక్ట్స్ కొనటం మానేయటం అంటే... చైనాలో వేలాది మంది రోడ్డున పడటమే! అందుకే, చైనాకు మన మార్కెట్స్ లో రెడ్ సిగ్నల్ చూపటం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది!
పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ కూడా పోతే ఆక్సిజన్ ఆగిపోయినట్టే. ఎందుకంటే, గతంలో లాగా అమెరికా ఇప్పుడు ఆ దేశానికి వంత పాడటం లేదు. వున్నది కేవలం డ్రాగన్ అండ మాత్రమే. మోదీ ఆ కనెక్షన్ కూడా కట్ చేశాక యుద్దానికి వెళితే నష్టం తక్కువగా వుంటుంది. ఇప్పటికిప్పుడు వార్ అంటూ ఊగిపోతే చైనా కారణంగా తలనొప్పులు వచ్చే ఛాన్సే ఎక్కువ. అందుకే, యుద్ధానికి ఇంకా కొంత టైం వుందన్నది పచ్చి నిజం.
పాకిస్తాన్ మన సైనికుల్ని ఊచకోత కోస్తే కూడా మనం చేతకాని వాళ్లలా వుండాల్సిందేనా? అదే అంతర్జాతీయ ఒత్తిడి లాంటి పదాలు వాడుతూ కాలం గడపాలా? ఈ ప్రశ్నలు మనకు కలగటం సమంజసమే. కాని, పాక్ మన మీద అక్రమ ఉగ్రవాద మూకలతో దాడి చేస్తోంది. మనం అధికారిక ఆర్మీతో అటాక్ చేయాలి. ఇక్కడే అసలు లొసుగు వుంది. పాక్ ను మనం యుద్ధంతో ఎదురుకునే దాకా మనకూ ఓ అక్రమ కాదంటే అనధికారిక ఆర్మీ వుండాలి. వాళ్లతో పాక్ పని పట్టాలి.
అక్రమ, అనధికారిక ఆర్మీ అంటే భారతీయ ఉగ్రవాదులు అని కాదు! పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాలతో నిండిపోయిన టెర్రర్ మార్కెట్. అక్కడ డబ్బులు గుమ్మరిస్తే తమ స్వంత జనాన్ని కూడా మానవ బాంబులతో పేల్చేసే కిరాయి జిహాదీలు బోలెడు మంది వున్నారు. వాళ్లే తమ దేశంలోనే మసీదుల వద్ద, స్కూల్స్ వద్ద, మార్కెట్లలో, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలుస్తుంటారు. పాక్ పూర్తిగా బలహీనపడే దాకా అలాంటి అల్లరి మూకల్ని ఇండియా పోషించాలి. ఇది కుట్ర అవ్వొచ్చు. కాని, నక్క లాంటి పాక్ ను ఎదుర్కొనే చీప్ అండ్ బెస్ట్ మార్గం అదే! అక్కడి కిరాయి ఉగ్రవాదుల్ని అక్కడే ఖరీదు చేసి అక్కడే బాంబులు పేల్పిస్తూ అతలాకుతలం చేయాలి. ఎప్పుడైతే పాక్ ఇక తన వల్ల కాదని చేతులు ఎత్తేస్తుందో... అప్పుడు చైనాను మ్యానేజ్ చేసి... బలూచిస్తాన్ వేర్పాటు పూర్తి చేయాలి! పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన దేశంలో కలుపుకోవాలి. మిగిలిన అవశేష పాక్ ను ఓ కంట గమనిస్తూ అలా వదిలేయాలి. ఇదంతా చెప్పినంత ఈజీ కాదు. కాని, ఇంతకంటే ఈజీ మార్గం మాత్రం... నిస్సందేహంగా యుద్ధం కాదు! అది మనకు బోలెడంత అనవసర నష్టం తెచ్చే ప్రమాదం వుంది!