ఉరసా ఎకరం 99 పైసలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం..లోకేశ్ సవాల్
posted on May 27, 2025 @ 7:09PM
ఊరాసాకు ఎకరం 99 పైసలకే ఇచ్చినట్టు నిలిపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. కడప నగరంలో పబ్బాపురం లే ఔట్ లో నిర్వహించిన మహానాడు మొదటి రోజు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అనంతరం లోకేష్ మహానాడు ప్రాంగాణంలోని మీడియా పాయింట్ లో విలేకరులతో చిట్ లో పాల్గొన్నారు. . తదుపరి సీఎం మీరే గా అన్న మీడియా ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందన్నారు. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు, ఆయన ఇంకా యువ నాయకుడే అన్నారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు. అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. దివంగత టీడీపీ నేత వీరయ్య చౌదరికి నివాళులర్పించేందుకు వెలితే పోగాకు రైతుల సమస్యలు తెలిశాయని, వెంటనే అధికారులకు మంత్రుల బృందానికి అప్రమత్తం చేశామన్నారు. పార్టీకి నిరంతరం ఫీడ్ బ్యాక్ అవసరం అనటానికి ఇదో ఉదాహరణ అన్నారు. క్రింది స్థాయి అభిప్రాయాల పై నిరంతర చర్చ జరగాలని, పార్టీ బలంగా వుండాలని, సంస్థాగతంగా బాగుండాలని లోకేష్ విలేకరులతో నిర్వహించిన చిట్ చాట్ లో పేర్కొన్నారు. ఉరసా సంస్థకు 99 పైసలకుఎకరా భూమి ఇచ్చినట్లు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా వున్నానని నారా లోకేష్ సవాల్ చేశారు. కడప నగరంలో నిర్వహించిన మహానాడు సందర్భంగా విలేకరులతో చిట్ చాట్ గా మాట్లాడుతూ టీసీఎస్ కు 99 పైసలకు ఇచ్చామని, ఉరసాకు మార్కెట్ ధరకే భూములు ఇచ్చామన్నారు.
విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఇక విశాఖ నగరాన్ని అందుకోలేమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. మద్యం కుంభకోణంలో జగన్ వైఖరి దొంగే ... దొంగ దొంగ అనట్లు వుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయే కానీ ఒక్కటి కూడ బయటకు పోదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవడానికి రాష్ట్రంలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం లేదన్నారు. పార్టీ తరపున బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన అందరికీ పదవులు వస్తాయని, పదవులు రాలేదని నేతలు అలకబూనడం మానేయాలని హితవు పలికారు. తాను విద్యాశాఖ మంత్రి అయ్యాక రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడ మూత వేయలేదన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ నాయకులు కళ్లు తెరిచి చూడాలన్నారు.