Read more!

సురక్షితం కాని మందులు ఇవ్వడం ఘోర తప్పిదం!

ప్రపంచఆరోగ్య సంస్థ సురక్షితం కానిమందు లను వాడడం ఘోరతప్పిదం గా పేర్కొంది. సురక్షితం కాని మందులను వివిద్ధ స్థాయిలలో ఇవ్వడం వైద్య రంగాని బలహీన పరుస్తుందని దానివల్ల అలసట వాతావరణం సరిగా లేకపోవడం అలాకాక కొన్ని సందర్భాలలో సిబ్బంది కొరత కూడా ఏర్పడవచ్చని డబ్ల్యు హెచ్ ఓ ఒకప్రకటనలో పేర్కొంది.

ప్రపంచరోగుల పరిరక్షణ సంరక్షణ లో హానికారక మైన అంశాలు ఉండరాదని సురక్షితం కానిమందులను ఇవ్వడం ఘోర తప్పిదం కాగలదని దీనికారణంగా ఒక్కోసారి తీవ్రమైన అంగవైకల్యానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని ఒక్కోసారి మరణానికి దారితీస్తుందని సురక్షితం కాని వైద్యం సాధన వల్ల సంవత్సరానికి 42 యు ఎస్ మిలియన్ డాలార్లు ఖర్చుచేస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దిగువ-మధ్య తరగతి ఆదాయం ఉన్న దేశాలు దక్షిణ ఆశియా ప్రాంతాలలో రోగులు వారిపట్ల సరైన సంరక్షణ లేనందు వల్లే 1౩4 మిలియన్ల వ్యతిరేక ఫలితాలు దీనివల్ల 2 -6 మిలియన్ల మరణాలు చోటుచేసుకుంటున్నాయని డబ్ల్యు హెచ్ ఓ దక్షిణ ఆశియ ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనం కేత్రవాల్ సింగ్ అన్నారు.

అసురక్షిత వైద్యం చేయడం వంటి తప్పిదాలు వివిదస్తాయిలలో ఉంటుందని అది వైద్య రంగాన్ని బలహీన పరుస్తుందని దీనివల్ల అలసట సరైన వాతావరణం లేకపోగా పనిచేసే వారి సంఖ్య తగ్గిపోవడం వంటివి ఉంటాయాని ఒకకధనం లో పేర్కొన్నారు.