వార్షిక బడ్జెట్.. ఈ సారైనా జనరంజకంగా ఉండేనా?!
posted on Jan 30, 2025 @ 12:22PM
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 31)నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సారి బడ్జెస్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత సమావేశాలు శుక్రవారం (జనవరి 31)న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకూ జరుగుతాయి. ఇక రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకూ సాగుతాయి. ఇలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (జనవరి 31) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్ర ఈ సమావేశాలు ప్రారంభమౌతాయి. రాష్ట్రపతి ప్రసంగం తరువాత ఆ రోజు కు సభ వాయిదా పడుతుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారం (ఫిబ్రవరి 1)న కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడతారు.
వార్షిక బడ్జెట్ సభలో ప్రవేశ పెట్టే ప్రతి సారీ దేశ ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి జీవులు తమకు ఈ బడ్జెట్ ఊరటకలిగిస్తుందని ఆశిస్తారు. మరీ ముఖ్యంగా వేతన జీవులు ఆదాయ పన్ను పరిమితి పెంపుపై పలు ఆశలు పెంచుకుంటారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఏడు సార్లు యూనియన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఇప్పుడు ఎనిమిదో సారి కూడా ప్రవేశపెట్టి తన రికార్డును తానే తిరగరాయనున్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడు సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు కానీ, వేతన జీవులకు కానీ పెద్దగా ఊరట కలిగించింది లేదు. అయితే ఈ సారి మాత్రం నిర్మలా సీతారామన్ బడుగు, మధ్యతరగతి, వేతన జీవులకు ఒకింత ఊరట కలిగేలా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ కంటాక్స్ పరిమితి పెంపు, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంచి చర్యలు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి.