రష్యాలోకి ఎంటరైన ఉక్రెయిన్ సైన్యం!
posted on Aug 8, 2024 @ 12:30PM
ఉక్రెయిన్ సైనికులు మామూలోళ్ళు కాదు.. చిన్న దేశం అయినప్పటికీ, చాలాకాలం నుంచి రష్యా భారీ దాడులను ఎదుర్కొంటోంది. తాజాగా ఉక్రెయిన్ సైనికులు రష్యాలోకి ఎంటరయ్యారు. రష్యా దక్షిణ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్ సైన్యం గురువారం నాడు రష్యాలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని రష్యా కూడా అంగీకరించింది. ఉక్రెయిన్ సైన్యం మా దేశంలోకి ప్రవేశించింది. వారితో భీకర యుద్దం జరుగుతోంది అని రష్యన్ ఆర్మీ ప్రకటించింది. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాలోకి భారీ సంఖ్యలో ఉక్రెయిన్ సైన్యం ప్రవేశించడం ఇదే ప్రథమం. తమ దేశంలోకి ఉక్రెయిన్ సైనికులు ప్రవేశించడంతో రష్యా దేశ సరిహద్దుల్లో ఎమర్జెన్సీని విధించింది. రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఫైట్‌లో 31 మంది పౌరులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ సైనికులు రష్యాలోకి ఎంటరైన ప్రాంతానికి దగ్గర్లోనే వున్న కుర్క్స్ అణు విద్యుత్ కేంద్రం దగ్గర రష్యా ప్రభుత్వం భద్రత పెంచింది.