రఘురామ, విజయసాయి ట్వీట్ వార్
posted on Jun 13, 2022 @ 1:26PM
ఇద్దరూ వైసీపీ ఎంపీలే.. అయినా వారిద్దరి మధ్య ట్విట్ల వార్ ఓ రేంజ్ లో జరిగింది. ఒకరు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. మరొకరు అదే పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. వైసీపీ సర్కార్ తప్పిదాలను, దాష్టీకాలను, దౌర్జన్యాలను, దుర్మార్గాలను ఎత్తి చూపుతూ తనదైన స్టైల్ లో రఘురామకృష్ణరాజు మీడియా ముఖంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం ఆయన ‘మద్యం పూర్తిగా నిషేధిస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 8 వేల కోట్ల రూపాయల రుణం సమీకరించడం, తన అనర్హత పిటీషన్ పై లోక్ సభ స్పీకర్ కార్యాలయ స్పందన, ఇతర ముఖ్య అంశాలపై రచ్చబండ’ అని రఘురామ ట్వీట్ చేశారు. దీంతో రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి రఘురామరాజుపై వ్యక్తిగత విమర్శలతో ట్వీట్ చేయడంతో వారిద్దరి మధ్య ట్వీట్ వార్ ఓ రేంజ్ లో సాగింది.
‘ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాల’ని రఘురామను రెచ్చగొట్టేలా విజయసాయి ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా నాలుగు పచ్చ కుల ఛానెల్స్ మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు.. నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజుకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తందం’టూ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశారు. ‘అడగకుండా నియోజకవర్గం వదలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు.. విగ్గురాజు.. పెగ్గురాజు’ అంటూ రెచ్చగొట్టారు. దీంతో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. విజయసాయి చేసిన వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు, ‘హలో రసిక వానరా! అవును నాకు ఉన్నది విగ్గు.. ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నావు? నువ్వు, నీ గ్యాంగ్ లీడర్ అనర్హత/ సస్పెన్షన్ పై చేతులు ఎత్తేశారా? నేను ఏపీకి వస్తే ముఖ్యమంత్రికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వుద్ది అనేగా నాపై కేసులు పెట్టిస్తున్నారు’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. ‘అజ్ఞాతవాసం తర్వాత పాండవులకి, అరణ్య వాసం తరువాత శ్రీరాముడికి జరిగింది పట్టాభిషేకం. చచ్చింది కౌరవులు, దానవులు. తెలుసుకోరా కండోమ్ రెడ్డి!!’ అంటూ ఓ స్థాయిలో రఘురామ కృష్ణం రాజు రిటార్డ్ ఇచ్చారు.
అప్పటికైనా విజయసాయికి సిగ్గొచ్చిందా అంటే.. ‘ఒరేయ్ డూప్లికేట్ గాజు.. నీ మీసాలైనా ఒరిజిలేనా? లేక పీకి అంటించుకున్నావా? వాటిని మెలి తిప్పడం ఎందుకురా?’ అంటూ మరింత వ్యక్తిగతంగా వెళ్లి మరీ అసందర్భ వ్యాఖ్యలతో ట్వీట్ పెట్టి. రెచ్చగొట్టారు. దానికి బదులుగా రఘురామ ‘’ఎవడు ఒరిజినల్ రాజో.. ఎవడు డూప్లికేట్ రెడ్డో ప్రజలకి ‘ఎరుక’లే రా! మనం కలిసినప్పుడు నా వెంట్రుకలన్నీ చూపిస్తా.. నువ్వే పీకి చూస్కో!’అంటూ ట్వీట్ చేశారు రఘురామ రాజు. వీరి ట్వీట్లపై నెటిజన్లు కూడా ఓ స్థాయిలో స్పందిస్తున్నారు. నెటిజన్ల స్పందన రఘురామ రాజుకు అనుకూలంగా ఉండటం విశేషం. నెటిజన్లు సెటైర్లతో విజయసాయికి దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చేస్తున్నారు. విజయసాయి ఒక రాక్షస జంతువని, పైశాచికానందం ఎక్కువ అంటూ కొందరు ఫైరవుతున్నారు. ‘తెల్ల తాతకి దూల తీరిపో యిందం’టూ మరి కొందరు సైటైర్లు దంచారు.
ముసలోడికి ముందుంది జైళ్ల పండుగ అని ఇంకొకరు, కండోమ్ తాతకు అడిగి మరీ తన్నించుకోవడం బాగా అలవాటంటూ మరొకరు, వెంట్రుకలు పండాయి,రేపో మాపో కాటికి పోయే వయసులో… డిక్కీ బలిసి కొట్టుకుంటున్నాడని ఇంకో నెటిజన్, రాజుగారూ ఈడీ చానల్ ని కూడా పిలవండి. పాపం నక్కబొక్కల రెడ్డి తెగ మధనపడిపోతున్నాడంటూ మరొకరు.. ముసలి నక్కకు రాజుగారు డైరెక్ట్ గా గునపమే దింపారంటూ ఇంకో నెటిజన్ పంచ్ వేశారు. మొత్తానికి రాజు వర్సెస్ రెడ్డి ట్వీట్ వార్ లో నెటిజన్లు కూడా రఘురామకు మద్దతుగా నిలుస్తుండడం విశేషం.