ఆత్మకూరు పోరులో మేకపాటి ‘వర్గ’ పోరు
posted on Jun 13, 2022 @ 2:07PM
నాయకునికి విధేయంగా వుంటామని, పాలనాపరమయిన అన్ని నిర్ణయాలకు, పార్టీ విధి విధానాలకు కట్టు బడి వుంటామని దీప ప్రమాణం చేసి మరీ రంగంలోకి దిగినవారు క్రమేసీ దూరమయ్యే పరిస్థితులు వచ్చా యి. ఎన్నికలు మరో రెండేళ్లలో జరుగనుండగా వైసీపీలో విభేదాలు తెరమీదకి వస్తున్నాయి. జగన్ వెంటే వుండి అద్భుతంగా విజయాలు అందిస్తామన్నవారే ఒకరితో ఒకరు విభేదించుకుని నాయకుని, పార్టీ ప్రతిష్ట ను బజారున పడేస్తున్నారు.
అందుకు తాజా వుదాహరణ మేకపాటి వర్గీయుల రభస. నాయకునికి విధేయంగా వుంటామని, పాలనాపరమయిన అన్ని నిర్ణయాలకు, పార్టీ విధి విధానాలకు కట్టు బడి వుంటామని దీప ప్రమాణం చేసి మరీ రంగంలోకి దిగినవారు క్రమేసీ దూరమయ్యే పరిస్థితులు వచ్చా యి. ఎన్నికలు మరో రెండేళ్లలో జరుగనుండగా వైసీపీలో విభేదాలు తెరమీదకి వస్తున్నాయి. జగన్ వెంటే వుండి అద్భుతంగా విజయాలు అందిస్తామన్నవారే ఒకరితో ఒకరు విభేదించుకుని నాయకుని, పార్టీ ప్రతిష్ట ను బజారున పడేస్తున్నారు. అందుకు తాజా వుదాహరణ మేకపాటి వర్గీయుల రభస.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి పెట్టిన టార్గెట్‌కి అక్కడి పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు తమ స్థాయిలో కృషిచేస్తున్నారని, వ్యూహాలు రచిస్తున్నారని అంతా అంటుకుంటారు. కానీ జరుగుతున్నది వేరు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రాజశేఖర్ రెడ్డి అసలు ఆత్మకూరు మొహం చూడ్డంలేదు. అక్కడి వైసీపీ వర్గీయులంతా ఇప్పటికే కంగారుపడుతున్నారు. జగన్ ఆశించిన మేరకు ప్రచారం జరిగే అవకాశం లేదు. ఆయన పెట్టిన టార్గెట్‌లో సగం సాధించినా గొప్ప విషయమే అను కుంటున్నారు.
పార్టీ నేతల సమావేశంలో జడ్పీటీసి సుధాకర్‌రెడ్డి పై వైసీపీ నేత రేవూరి వేణుగోపాల్ రెడ్డి విరుచుకుపడటం విభేదాలను బహిర్గతం చేసింది. ప్రతీ మండలాన్ని వైసీపీకి అనుకూలం చేయడా నికి మంత్రులు ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. కానీ మేకపాటి వర్గీయులు మూడు గ్రూప్‌లుగా విడిపో యారు. ఎవరికి వారుగా వ్యవహ రిస్తూ ఏకంగా తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికీ కూడా వెనుకాడటం లేదు. వారిని శాంతపరచడా నికి ఎమ్మెల్యేలు, మంత్రులు నానా అవస్థా పడుతున్నారు. ఎవరూ ఇప్పటి పరిస్థితుల్లో తగ్గేలా కనపడటం లేదని విశ్లేషకుల మాట.
ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో ఉప ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ సోమవారంతో ముగుస్తుంది. ఇక్కడ ఇంతవరకూ చాలామంది హేమాహేమీలే విజయం సాధించేరు. ఆత్మకూరును వైసీపీ ఎంతో ప్రతి ష్టాత్మకంగా తీసుకుంది. అందువల్ల భారీ మెజారిటీతో గెలిచితీరాలన్న ఆదేశం జగన్ ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ వర్గీయుల్లో అంతటా వ్యక్తమవుతున్న విభేదాలతో మరి ఏ మేరకు పార్టీ ప్రతిష్టను నిలబెడుతుందో చూడాలి.
రోజుకో విధంగా రోజుకో ప్రాంతంలో వైసీపీ సోదరుల మధ్య విభేదాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. పార్టీ అధినేతకు వూహించని విధంగా షాక్ మీద షాక్ ఇస్తున్నారు. తామంతా ఐక్యంగా వున్నామని, మా పాలనకు ఎలాంటి ఢోకా లేదని చేసుకున్న, చేసుకుంటున్న ప్రచారమంతా ఒట్టిదే నని పార్టీ వర్గీయుల మధ్య విభేదాలే స్పష్టం చేయడం ఎవరూ వూహించని పరిణామం. ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందేమోననే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.