టర్కీ బొగ్గుగనిలో పేలుడు.. 250 మంది మృతి!
posted on May 14, 2014 @ 12:13PM
టర్కీలోని సోమా ప్రాంతంలో వున్న ఒక బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో దాదాపు 250 మంది గని కార్మికులు మరణించారు. గని లోపల ఇంకా చాలామంది తీవ్రంగా గాయపడి వుండొచ్చని భావిస్తున్నారు. పేలుడుతోపాటు పేలుడు వల్ల విషవాయువులు వెలువడటంతో ఇంత భారీస్థాయిలో మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మొత్తం 787 మంది కార్మికులు వున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని భయపడుతున్నారు. రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. అయితే ఎక్కడో భూమి లోపల గనిలో వున్నవారిని బయటకి తీసుకురావడానికి వారు చాలా శ్రమించాల్సి వస్తోంది. గని లోపల భారీ స్థాయిలో దుమ్ము, పొగ అలముకుని వున్నందున ఎవరికీ ఏమీ కనపించని పరిస్థితి వుంది.