లగడపాటి సర్వే ఫలితాలు: టీడీపీ, బీజేపీ హవా!
posted on May 14, 2014 @ 11:59AM
ఎన్నికల కోడ్ ముగియడంతో సర్వేల సూపర్‌స్టార్ లగడపాటి రాజగోపాల్ తాను చేయించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను బుధవారం వెల్లడించారు. లగడపాటి గతంలో చెప్పినట్టుగానే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే రాష్ట్రం విడిపోయిన పక్షంలో సీమాంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం విడిపోకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. రాష్ట్రం విడిపోయిన పక్షంలో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. లగడపాటి వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు అంకెల్లో ఇలా వున్నాయి.
సీమాంధ్రలో ఎంపీ స్థానాలు...
టీడీపీ, బీజేపీ కూటమి: 19 నుంచి 22 స్థానాలు.
వైకాపా: 3 నుంచి 6 స్థానాలు.
సీమాంధ్రలో ఎమ్మెల్యే స్థానాలు...
టీడీపీ, బీజేపీ కూటమి: 115 నుంచి 125 స్థానాలు
వైకాపా: 45 నుంచి 55 స్థానాలు.
తెలంగాణలో ఎంపీ స్థానాలు...
టీఆర్ఎస్: 8 నుంచి 10 స్థానాలు.
కాంగ్రెస్: 3 నుంచి 5 స్థానాలు.
టీడీపీ, బీజేపీ కూటమి: 3 నుంచి 4 స్థానాలు.
ఎంఐఎం: 1 స్థానం.