గన్ పార్క్ వద్ద తెలంగాణా తెదేపా యం.యల్యే.ల నిరసన దీక్ష

 

మంత్రి హరీష్ రావు ప్రతిపాదన మేరకు తెలంగాణా శాసనసభ నుండి మొత్తం పదిమంది తెదేపా యంయల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడంతో అందుకు నిరసనగా వారు ఈరోజు హైదరాబాద్ లో గన్ పార్క్ వద్ద ఒక్కరోజు నిరసన దీక్ష చేప్పట్టబోతున్నారు. ఆ తరువాత వారు రేపటి నుండి మెహబూబ్ నగర్ లో పర్యటించి తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ నిరంకుశ వైఖరి గురించి ప్రజలకు వివరించబోతున్నారు. ఇదివరకు కూడా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించింది. అప్పుడు కూడా వారు ఇదేవిధంగా నిరసన యాత్రలు చేప్పట్టారు.

 

దీని వలన ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళుతున్నాయి? అని ఆలోచించకుండా శాసనసభ సమావేశాలు జరుగుతున్నంత కాలం శాసన సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాదని ముఖ్యమంత్రి చెప్పడం తెదేపా యం.యల్యేలు చేస్తున్న ఆరోపణలను దృవీకరిస్తున్నట్లున్నాయి. దాని వలన తెలంగాణా ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎటువంటి ఇబ్బంది, నష్టమూ కలగకపోవచ్చును. కానీ ఎన్నికల సమయంలో ఇటువంటి వన్నీ తప్పకుండా వాటి ప్రభావం చూపుతాయనే విషయం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది.

Teluguone gnews banner