రేపటి దీక్షను ప్రధాన లక్ష్యంగా చేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం.....
posted on Oct 31, 2019 @ 10:06AM
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సకల జనులు సమరభేరి బహిరంగ సభ ముగిసింది. ఉద్యమంలో భాగంగా రేపు ఒక్క రోజు దీక్షలో ఇరవై నాలుగు గంటల పాటు కార్మికులు దీక్షలో కూర్చోవాలని పిలిపునిచ్చారు. విలీనమై ప్రధాన ఎజెండాగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రధానమని కార్మికులు ఈ సభ ద్వారా తెలియచేసారు. పలువురు నేతలు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్టీసీలో సకల జనుల సమ్మెను మించి ఇప్పుడు కార్మికులు ఐక్యంగా పోరాడుతున్నారన్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామరెడ్డి.
సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు కార్మికులంతా ఐక్యంగా ముందుకు సాగాలని కార్మికులలో విభేదాలు తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు టిటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ. ఇరవై ఐదు రోజులుగా ఉన్న తమ ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేసిఆర్ కుట్రలు పన్నుతారని, ఏ కుట్రకు కూడా తాము తలవంచకుండా ఐకమత్యంగా ఉండాలి అని టిటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ తెలియజేశారు.ఆర్టీసీ కార్మకుల పట్ల కేసీఆర్ తండ్రిగా భావించి సమస్యలు పరిష్కరించాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు. కార్మికుల వెంటే కాంగ్రెస్ ఉంటోందని బీహెచ్ హామీ ఇచ్చారు. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న వారంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని వాపోయారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ. పేదలు ఎక్కువగా ఉపయోగించే సంస్థనే నాశనం చేసేందుకే సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది అన్నారు.