బండి సంజయ్‌కు ఎంపీ పదవి కేసీఆర్ భిక్షే!
posted on Dec 29, 2020 @ 3:14PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలకు కౌంటరిచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టకొని మాట్లాడాలని, లేకుంటే అంతే ధీటుగా జవాబు ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదన్నారు బాల్క సుమన్. బీజేపీ ఎంపీలు స్మార్ట్ సిటీ నిధులను ఢిల్లీలో ఆపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ నేతలకు దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని బాల్క సుమన్ సవాల్ విసిరారు. ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్నారు. బండి సంబయ్ కి ఎంపీ పదవి కూడా సీఎం కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు బాల్క సుమన్. కేసీఆర్ ఉద్యమం చేయకుంటే… తెలంగాణ రాకుంటే సంజయ్‌కి ఆ పదవి ఎక్కడిదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.