ఎమ్మెల్సీ ఎన్నికలకి అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన తెరాస
posted on Dec 7, 2015 6:42AM
వరంగల్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో మంచి ఉత్సాహంగా ఉన్న అధికార తెరాస త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలని కూడా అదే ఉత్సాహంతో ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేస్తున్నట్లు అందరికంటే ముందుగా తన పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. తెలంగాణాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలలు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో 7 స్థానాలకు తెరాస తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది.
పి. సతీష్-అదిలాబాద్, లక్ష్మి నారాయణ- ఖమ్మం, ఆర్. భూపతి రెడ్డి-నిజామాబాద్, టి. చిన్నప్ప రెడ్డి-నల్గొండ, భూపాల్ రెడ్డి-మెదక్, ఎన్.లక్షణ రావు, భాను ప్రసాద్-కరీంనగర్ నుండి పోటీ చేస్తారు. రేపటిలోగా మిగిలిన ఐదుగురు అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటిస్తామని తెరాస సెక్రటరీ జనరల్ కె. కేశవ్ రావు తెలిపారు.
“మా అభ్యర్దులందరినీ గెలిపించుకోగల బలం మాకు ఉంది కనుకనే మొత్తం 12 స్థానాలలో తెరాస అభ్యర్ధులను నిలబెడుతున్నాము తప్ప ఇతర పార్టీల మద్దతు కోసం తాము ఎవరితోనూ బేరసారాలు చేయడం లేదని” కేశవ్ రావు అన్నారు. కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కూడా నేడు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. తమకు పూర్తి బలం ఉన్న చోటనే పోటా చేయాలనీ ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి.