ప్రాణం తీసిన చెట్టు!
posted on May 22, 2024 @ 4:21PM
ప్రాణవాయువు ఇచ్చే చెట్టు నిండు ప్రాణం తీసింది. చెట్టు విరిగి మీద పడటంతో రవీంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. భార్య సరళాదేవితో కలసి రవీంద్ర ద్విచక్ర వాహనం మీద ఆస్పత్రి ఆవరణలో ప్రవేశించగానే చెట్టు విరిగి వారి మీద పడింది. చెట్టు మోడు రవీంద్ర ఛాతీ మీద పడటంతో ఆయన అక్కడకక్కడే మరణించారు. సరళాదేవి తలకు గాయం తగిలింది. సరళాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు కాలికి నొప్పిగా వుండటంతో చికిత్స కోసం భర్తతో కలసి కంటోన్మెంట్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ ఈ ఘోరం జరిగింది. ఈ దంపతుల మీద కూలిన చెట్టు ఎన్నాళ్ళక్రితమో వేళ్ళు పెకల్చుకుని బయటకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది చెట్టును తొలగించకపోవడం వల్ల ఒప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది. భర్త చనిపోయిన విషయం ఇంకా సరళాదేవికి తెలియదు..