బిగ్ బ్రేకింగ్.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి
posted on Jun 26, 2021 @ 8:06PM
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది .ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లే మల్కాజ్ గిరి ఎంపీ , ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిపై పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. తెలంగాణ పీసీసీ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. చివరి వరకు మాత్రం రేసులో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి నిలిచారు. అయితే రాష్ట్ర నేతల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణలో మెజార్టీ నేతలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురిని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా 10 మందిని నియమించింది ఏఐసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం కొనసాగుతున్న మహ్మద్ అజారుద్దీన్ తో పాటు మాజీ మంత్రి గీతా రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మహేష్ గౌడ్ ను అపాయింట్ చేసింది. ఇక సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా సీనియర్ నేతలు సంభాని చంద్రశేఖర్, మల్లు రవి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే పొదెం వీరయ్య , సురేష్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నిరంజన్, కుమార్ రావు, జావెద్ అమీర్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్.
టీపీసీసీ కమిటితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఛైర్మన్, అజ్మదుల్లా హుస్సేన్ కన్వీనర్ గా ప్రచార కమిటీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఛైర్మన్ గా ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటి, నిర్మల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆలేటీ మహేశ్వర్ రెడ్డి చైర్మన్ గా ఏఐసీసీ ప్రోగామ్ ఆర్గనేజింగ్ కమిటీని కూడా ఏఐసీసీ ప్రకటించింది.