అరాచక పాలన.. రోడ్డుపై ధాన్యం.. కాంగ్రెస్ రచ్చబండ.. జెండా ఎగరలే... టాప్ న్యూస్@1PM
posted on Dec 28, 2021 @ 11:58AM
ఓటీఎస్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని టీడీపీ శ్రేణులు బ్రహ్మాండంగా పోరాడారన్నారు.ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న తమ పార్టీ నేతలపై పోలీసులు పలుచోట్ల అన్యాయంగా విరుచకుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
---
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా బీజేపీ మౌనంగా ఉంటుందని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి జరిగినా పట్టించుకోలేదన్నారు. హిందుత్వ అంశాలపై కూడా బీజేపీ మౌనం వహిస్తోందని అన్నారు. ధర్మకర్త అశోక్‌గజపతిరాజుపై దాడి జరిగినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆర్థిక అరాచకాలపై బీజేపీ నేతలు నోరెత్తట్లేదన్నారు
--------
గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం మునిపల్లెలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై వరి ధాన్యం పోసి వరి రైతులు ధర్నా చేపట్టారు. రైతుల పండించిన వరి ధాన్యం అంతా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని దూళిపాళ్ల డిమాండ్ చేశారు.
-------
బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ప్రజాగ్రహం తమపై ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎజెండానే.. బీజేపీ ఎజెండా అని వ్యాఖ్యానించారు. బీజేపీకి పెట్రో ధరలపై మాట్లాడే దమ్ము ఉందా అని నిలదీశారు. మద్యం ధరలు పెరిగినందుకు కాదని.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినందుకు బీజేపీ నేతలు బాధపడాలన్నారు. ఎరువుల ధరల పెంపుపై బీజేపీకి బాధలేదా అని అన్నారు
---------
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై నీతి ఆయోగ్ వచ్చి ర్యాంకు ఇచ్చిందని... దానికి బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విభజన హామీలు ఎంతమేరకు నెరవేర్చిందో బీజేపీ చూసుకోవాలని హితవుపలికారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీ రాష్ట్రంలో సభ నిర్వహిస్తోందన్నారు. ఓటీఎస్ నిర్బంధమైన పథకం కాదు... స్వచ్చంధమని స్పష్టం చేశారు
----------
వైసీపీ పార్టీపై సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా అవమానపరుస్తోందని మండిపడ్డారు. రామతీర్ధం కొండపై రాక్షసకాండ జరిగి ఏడాదైనా నిందితులను పట్టుకోలేకపోవటం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనమన్నారు. జగన్ ప్రభుత్వం రహస్య ఎజెండాతో హిందువులను అణచివేస్తోందని ఆరోపించారు.
-------
నెల్లూరు జిల్లా చిట్టమూరులో దారుణం జరిగింది. మైనర్ బాలికపై హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ అత్యాచారయత్నం చేశాడు. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంటికి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయం బాలిక తన తండ్రికి చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్ కానిస్టేబుల్ పై ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.
----
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధిష్టానానికి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఏకంగా టీపీసీసీ చీఫ్ ను మార్చాలని కోరారు జగ్గారెడ్డి. పార్టీ బైలాను ఆయన పాటించడం లేదని, సీనియర్ నేతలను కలుపుకోవడం లేదన్నారు. పీసీసీ కమిటీతో చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు జగ్గారెడ్డి.
----------
టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. వందేళ్ల సింగరేణిని వేలం పెట్టడం టీఆర్ఎస్‌కు తెలియదా అని ప్రశ్నించారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో కనీసం నోరు విప్పలేదన్నారు. వరి పండించడం ఇవ్వాళ కొత్తకాదని, కేసీఆర్ అసమర్థత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు
-------
కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగరవేస్తుంటే.. జెండా ఊడిపడి అదినేత సోనియా గాంధీ చేతుల్లో పడింది. సోనియా జెండా ఎగురవేసే సమయంలో జెండాకు కట్టిన దారం కాస్త మెలిపడింది. ఆ సమయంలో ఆమె దారాన్ని గట్టిగా లాగడానికి ప్రయత్నించారు. ఇంతలో ఆమె సహాయకులు ఆ దారాన్ని తీసుకుని గట్టిగా లాగారు. దీంతో జెండా పై నుంచి ఊడి పడి సోనియా గాంధీ చేతిలో పడింది.
--------