రివర్స్ పీఆర్సీ.. అమరావతి రైతులకు రిలీఫ్.. కారు జోరు.. టాప్ న్యూస్@1PM
posted on Dec 14, 2021 @ 11:50AM
ప్రజా సమస్యలపై పోరాడటమే జీవీ ఆంజనేయులు చేసిన తప్పా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. తక్షణమే అక్రమ కేసులు ఉపసంహరించుకోని క్షమాపలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలే లక్ష్యంగా జగన్ పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధిని వదిలేసి ప్రభుత్వం టీడీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుకే సమయం వెచ్చిస్తున్నారని మండిపడ్డారు.
-------
దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఐఆర్ 27 శాతం ఉంటే... 14 శాతం ఫిట్మెంట్ చాలు అని నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. సీఎస్ కమిటీ నివేదిక ప్రభుత్వ సూచనల ఆధారంగానే ఇచ్చారని స్పష్టం అవుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 43 శాతం కావాలి అని అడిగామని... ఇబ్బందులు ఉన్నా ఇచ్చారని తెలిపారు. జీతాలు పెంచమని అడిగితే... తగ్గిస్తామని అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
--
తిరుమల శ్రీవారిని దర్శించుంకునేందుకు అమరావతి రైతులకు టీటీడీ అనుమతిని ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టీడీపీ తెలిపింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. నవంబర్ 1న తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభమవగా... 17న తిరుపతిలో పాదయాత్ర ముగియనుంది. కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు.
------
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి. తాజాగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి బయటికి వచ్చారు. కడప ఎస్పీ అన్బురాజన్ కలిసి తనకు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు బామ్మర్ధి శివప్రకాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పీఏ కృష్ణారెడ్డి పేర్కొనడం సంచలనమైంది.
-----
గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. ఈపూరు మండలం ముప్పాళ్ళ లోఎస్సీ కాలనీలో మోసపోయిన వైసీపీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ వెలసింది. ఎస్సీలను ఎన్నికలలో ఓట్లు కోసం వాడుకున్నారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను వదిలేశారని ఫ్లెక్సీలో రాశారు. తమను అవమానపర్చిన వారికి తగు రీతిలో సమాదానం చెబుతామని, వైసీపీ నేతలు తమ కాలనీ జోలికి వస్తే గాడిదలతో సమానంగా ఆడవాళ్లుతో బుద్ధి చెప్పిస్తామంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.
-----
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానాలకు పోలింగ్ జరగగా... కౌంటింగ్ లో ఆరు సీట్లను కారు పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా ఎన్నిక సాగిందని ప్రచారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
-----
తెలంగాణలో అన్నదాతల మరణమృదంగం మోగుతోందని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ట్వీట్టర్ వేదికగా ఎంపీ స్పందిస్తూ.... ‘‘రుణమాఫీ లేదు, పంటను కొనే నాథుడు లేడు, అమ్మిన పంట సొమ్ముల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తోన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇంటి ముందు అప్పులోడి లొల్లి. సమస్య పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి తీర్థయాత్రలు, రాజకీయ భేటీలతో బిజీగా ఉన్నాడు’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
------
శిల్పా చౌదరి ఆర్థికమోసం కేసు డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఆమెను పోలీసులు ఇప్పటికే రెండు పర్యాయాలు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయినా కేసు కొలిక్కి రాకపోవడంతో.. తాజాగా మూడోసారి ఉప్పర్‌పల్లి కోర్టు శిల్పాచౌదరిని మరో రోజు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.మంగళవారం ఉదయం 10 గంటలకు శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకొని.. అదే రోజు సాయంత్రానికి తిరిగి చంచల్‌గూడ జైల్లో అప్పగించనున్నారు.
---
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం బీఎల్‌డబ్ల్యూ గెస్ట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరును ఈ సమావేశంలో ప్రధాని సమీక్షించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల పురోగతికి సంబంధించి సీఎంలు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
---
జమ్మూకశ్మీర్ విషయంలో పదేపదే పాక్ జపం చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూటి సలహా ఇచ్చారు. ''మీకు పాక్ పట్ల మరీ అంత ముచ్చట ఉంటే అక్కడకు వెళ్లి స్థిరపడొచ్చు'' అని అన్నారు.