జగన్ కు ఝలక్.. మడమ తిప్పడమే.. దిక్కులేని సీఎం.. టాప్ న్యూస్@8PM
posted on Nov 23, 2021 @ 6:46PM
టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. వరదల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
--------
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. సొంత కులానికి ముఖ్యమైన 1600 పదవులు కట్టబెట్టుకుని సీఎం జగన్ వెనకబడిన తరగతులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సీఎం జగన్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. సామాజిక న్యాయం గురించి జగన్ మాట్లాడొద్దని, సిగ్గుతో ఆ పదం ఆత్మహత్య చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. ‘‘నీ కులం కుతంత్రం, నీ మతం మారణహోమం, నీ లక్ష్యం విధ్వంసం’’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------
ఆనాడు మెజారిటీ లేదని కౌన్సిల్ రద్దుచేస్తామన్న ప్రభుత్వం.. ఈనాడు వైసీపీ మెజారిటీ పెరిగిందని మాటతప్పడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. కౌన్సిల్ రద్దుచేస్తే నష్టపోయేది ప్రభుత్వమేనని గతంలోనే చెప్పామన్నారు. కౌన్సిల్ రద్దు, ఏర్పాటు అనేది రాష్ట్రాల చేతిలో ఉండదన్నారు. మెజార్టీ పెరిగిందనే కౌన్సిల్ రద్దుపై ప్రభుత్వం వెనకడుగు వేసిందని వ్యాఖ్యానించారు. 3 రాజధానుల బిల్లుని తిరిగి ఆమోదించుకోవడానికే కౌన్సిల్ అవసరం వచ్చిందన్నారు.
---------
కడప జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలో 13 మంది సర్పంచ్‌లు వైసీపీకి రాజీనామా చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించినందుకు నిరసనగా సర్పంచ్‌లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించారు.
-------
ఏపీకి దశ తిరిగిందనుకుంటే దురదృష్టంగా మారిపోయిందని సీపీఐ నారాయణ అన్నారు. రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చే వరకు వైసీపీ నిద్రపోదన్నారు. చట్టానికి విరుద్ధంగా వెళ్తున్నామని తెలిసే బిల్లును వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. రాజధాని అంశాన్ని మళ్లీ కాలయాపన చేస్తారని చెప్పారు. వైసీపీ తప్పులు చేసి దానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉండదని, వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్లే నష్టపోతున్నామని మండిపడ్డారు.
----------
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక బుధవారం నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై లంచ్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయింది. మధ్నాహ్నం 2:15 గంటలకు విజయవాడ సీపీ.. కొండపల్లి మున్సిపల్ కమిషనర్ హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. తాము ఆదేశించినప్పటికీ ఎన్నిక ఎందుకు నిర్వహించలేకపోయారని ప్రశ్నించింది
---------
దేశంలోని 11 పోర్టుల సమన్వయంతో క్రూయిజ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పోర్టు, టూరిజం శాఖ అధికారులతో నగరంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రూయిస్ టెర్మినల్ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. ఏపీ టూరిజం అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
--------
ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీపై యుద్ధమే అని మళ్లీ అమిత్ షాను కలుస్తా అంటున్నారన్నారు. ఢిల్లీలో కేసీఆర్ యుద్ధం తేల్చుకుని వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వచ్చేలా ఉన్నాయని భట్టి ఎద్దేవా చేశారు
------------
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో దుబాయ్ నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న రూ.18 లక్షల విలువైన బంగారం, ఐ ఫోన్‌లను పట్టుకుని సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
----
సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ఆ పార్టీపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. గతంలోని యూపీఏ ప్రభుత్వం స్పందించే తత్వం లేనిదని, నిరుపయోగమైనదని, కనీసం దేశ భద్రత గురించి కూడా ఆ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఈ పుస్తకాన్నిబట్టి స్పష్టమవుతోందని ఆరోపించింది.