బాబుకు సోనూసూద్ పరామర్శ.. వరదలో ఇసుక అమ్ముతారట.. దిగొచ్చిన కమలం.. టాప్ న్యూస్@8PM
posted on Nov 21, 2021 @ 6:29PM
టీడీపీ అధినేత చంద్రబాబుకు నటుడు సోనూసూద్ ఫోన్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబును సోనూసూద్ పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవ్వాల్సిన అసెంబ్లీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. శాసనసభలో విధ్వంస ధోరణి సరికాదని, హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని సోనూసూద్ చెప్పారు.
--------
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగుల రాజీనామా కొనసాగుతున్నాయి. రైల్వే కోడూరులో దుద్యాల అనితా దీప్తి అనే మహిళా ఉద్యోగిని తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్, మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రగుంట్ల పట్టణ పేదరికి నిర్మూలన సంస్థ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న అనితా దీప్తి..రైల్వే కోడూరులోని ఎన్టీఆర్ విగ్రహం ముందు టీడీపీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు
--------
వైసీపీ కౌరవ మూకకు ప్రజానీకం బుద్ది చెబుతారని టీడీపీ నేత పట్టాభి హెచ్చరించారు. టీడీపీ అదినేత చంద్రబాబు కంట కన్నీరుతో.. ప్రపంచంలోని తెలుగువారంతా ఆవేదన చెందారని తెలిపారు. వార్డు మెంబర్లుగా ఓడిన చరిత్ర వైఎస్ కుటుంబానిదన్నారు. అవమానించిన అసెంబ్లీలోనే చంద్రబాబును రారాజుగా నిలిపేలా.. టీడీపీ కార్యకర్తలు పసుపు ప్రతిజ్ఞ చేయాలని పట్టాభి కోరారు
--------
అందరికీ అందుబాటులోకి ఇసుక అంటూ ఏపీ ప్రభుత్వం పత్రికా ప్రకటనలు ఇవ్వడం పట్ల జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరద నష్టంతో బాధపడుతుంటే ఇసుక అమ్ముతామంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు. వరద కారణంగా పచ్చని పంట పొలాల్లో ఇసుక మేట వేసిందని వెల్లడించారు. ఇలాంటి తరుణంలో ఇసుక అమ్మకాలపై పత్రికా ప్రకటనలు ఇచ్చిన వైసీపీ సర్కారును ఏమనాలని ప్రశ్నించారు.
----------
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలిశారు. జల వివాదాల తర్వాత సీఎంలిద్దరూ ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డికి, ఏపీ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది.
---------
కేసీఆర్ తో కలిసి ఏపీ సీఎం జగన్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఫోటోను తన పోస్టుకు జత చేసిన నారా లోకేష్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరదల్లో చిక్కుకుని ప్రజలు ప్రాణాలు రక్షించాలని వేడుకుంటున్నారని అన్నారు. జనాలను ఆదుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి.. తీరిగ్గా పెళ్లిళ్లకు వెళుతున్నారని కామెంట్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పోస్ట్ చేశారు నారా లోకేష్. ఏపీని దేవుడే కాపాడాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
---
రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రైతుల పాదయాత్రకు బీజేపీ తరపున సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదన్నారు. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఏ పార్టీ అయినా సభ్య సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సూచించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు
--------
టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఢిల్లీకి వెల్లే ముందు అభ్యర్దులను ఖరారు చేశారు సీఎం కేసీఆర్.పలువురు అభ్యర్దులకు బీ ఫాం ఇచ్చారు. సోమవారం అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనుంది టీఆర్ఎస్ అధిష్ఠానం.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పలుజిల్లాల్లో కొందరికి రెన్యూవల్ ఇవ్వగా.. మరికొందరికి మొండిచెయ్యి ఇచ్చారు గులాబీ బాస్.సింగర్ సాయిచంద్, ఎల్ రమణకు అవకాశం ఇచ్చారు.
---
సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చిందా? అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.ముఖ్యమంత్రి దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా..? పంజాబ్ రైతుల కోసమా? అన్నది అర్థంకాలేదన్నారు. కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ తీసేయాలన్న ముఖ్యమంత్రి అక్కడే ధర్నా చేశారని విమర్శించారు. మిల్లర్లతో కలిసి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, రైతుల కోసం ఆలోచించే పార్టీ బీజేపీ అని అన్నారు.
----------
వాదాస్పద సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించినప్పటికీ.. వాటిని చట్ట సభల్లో అధికారంగా రద్దు చేసి, కనీస మద్దతు ధరపై (ఎమ్‌ఎస్‌పీ) చట్టం చేసినప్పుడే తమ ఆందోళన విరమిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. రైతులను అంచనా వేయడంలో విఫలమయ్యామని, వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు